మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె టాలీవుడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ ను చూపడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె క్రికెట్ నేపథ్యంలో రూపొందిన కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. పర్వాలేదు అనే స్థాయి అంచనాల నడుము విడుదల అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

కానీ ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. కౌసల్య కృష్ణమూర్తి సినిమా తర్వాత ఈమె చాలా తెలుగు సినిమాలలో నటించింది. కానీ ఈమెకు తెలుగులో సరైన విజయం చాలా కాలం పాటు దక్కలేదు. తాజాగా ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్గా నటించింది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో ఐశ్వర్య రాజేష్ కి భారీ బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఇకపోతే మరికొన్ని రోజుల్లో చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా హీరోయిన్లను వెతికే పనిలో అనిల్ రావిపూడి బిజీ అయినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా చిరు కి జోడిగా ఐశ్వర్య రాజేష్ ను తీసుకుని ఆలోచనలో అనిల్ రావిపూడి ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే మరో సీనియర్ స్టార్ హీరో సినిమాలో ఐశ్వర్య రాజేష్ కి హీరోయిన్ గా అవకాశం దక్కుతుంది. మరి చిరు , అనిల్ కాంబోలో తెరకెక్కబోయే  సినిమాలో చిరంజీవికి జోడిగా ఏ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తోంది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: