ఈ మధ్యకాలంలో సినీ స్టార్ ల చిన్నప్పటి ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా వారి పేర్లను, ఫోటోస్ ని షేర్ చేస్తున్నారు. ఇక తాజాగా ఒక చిన్నపాప ఫోటో నేటింటా చాలా వైరల్ అవుతుంది. ఆ చిన్నారి చాలా అందంగా, రెండు జడలతో, పెద్ద కళ్లతో ఎంతో ముద్దుగా ఉంది. అయితే ఆ ఫోటో ఎవరిది.. ఆ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరు అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఆ చిన్నారి ఎవరో కాదు.. టాలీవుడ్ హీరోయిన్ అలాగే తాను ఓ స్టార్ హీరో భార్య కూడా. మరి తాను ఎవరో చూద్దాం.

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య భార్య సినీ నటి శోభితా ధూళిపాళ్ల. ఈమె తెనాలిలో జన్మించింది. శోభితా 2013లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకుంది. ఈమె ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. శోభితాకి భారతనాట్యం, కూచిపూడి కూడా వచ్చు. ఈమె 2016లో రామన్ రాఘవ్ 2.0 సినిమాలో తొలిసారి నటించింది. ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత గూడచారి, మేజర్ సినిమాలలో కనిపించింది. ఇటీవలే ఈ బ్యూటీ  2024 ఆగస్టు 8న హైదరాబాద్‌లో నటుడు నాగ చైతన్యతో నిశ్చితార్థం చేసుకొని.. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకుంది.


ఇక ఇటీవల ఈమె భర్త, టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ సినిమా మంచి హిట్ కొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ గా లేడి పవర్ స్టార్ సాయి పల్లవి నటించింది. గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా మొదటిరోజు పూర్తి అవ్వకముందే హిట్ టాక్ ని సొంతం చేసుకుని.. మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ మూవీకి క్రియేటివ్ దర్శకుడు చందు మొండేటి దర్శత్వం వహించారు. తండేల్ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. క్రియేటివ్ డైరెక్టర్, దేవి శ్రీ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకులకు మనసు దోచుకుంది. ఈ సినిమా గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: