మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా గురించి పరిచయం అనవసరం. ఈ అందాల భామ తెలుగుతో పాటుగా తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమె ఇప్పటికే దాదాపు 75పైగా సినిమాలలో నటించింది. ఈమె చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ సినిమాతో తన నటన జీవితాన్ని మొదలుపెట్టింది. తెలుగులో శ్రీ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తన నటనతో మంచి సినిమా అవకాశాలను కొట్టేసింది.

ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి, బాహుబలి, రచ్చ, తడాఖా, ఊపిరి, ఎఫ్ 1 అండ్ 2, సైరా నరసింహ రెడ్డి, బెంగాల్ టైగర్ సినిమాలలో నటించింది. అయితే గ్లామరస్ హీరోయిన్ తమన్నా, నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు అందరికీ తెలుసు. వీరిద్దరూ 2023లో లాస్ట్ స్టోరీస్ 2 సిరీస్ లో కలిసి పనిచేశారు. ఈ సిరీస్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వీరిద్దరూ నిత్యం వార్తల్లో నిలిచేవారు. తమన్నా, విజయ్ కూడా వారి ప్రేమ గురించి చాలా సార్లు  బయటపెట్టారు. తమన్నా, విజయ్ ఎక్కడికి వెళ్లిన కలిసే వెళ్లేవారు, కలిసే తిరిగేవాళ్లు.

 
అయితే ఇటీవల వీరిద్దరూ విడిపోయారు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలా వార్తలు వచ్చినప్పటికీ ఇద్దరిలో ఒక్కరూ కూడా స్పందించలేదు. హీరోయిన్ తమన్నా, విజయ్ కి బ్రేక్ అప్ చెప్పింది అంటూ వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టినప్పటికి.. తమన్నా కూడా ఈ వార్తలను ఖండించలేదు. ఇక నేడు హోలీ పండుగ సందర్భంగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇంట్లో హోలీ వేడుకలు జరిగాయి. ఆ హోలీ వేడుకలకు తమన్నా, విజయ్ ఇద్దరు హాజరయ్యారు. కానీ వీరిద్దరూ కలిసి రాలేదు.. అంతే కాదు తమన్నా, విజయ్ వేరు వేరు సమయాల్లో రవీనా ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. దీంతో వీరు నిజంగానే విడిపోయారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇకనైనా తమన్నా, విజయ్ స్పందిస్తారో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: