ఏప్రియల్ లో విడుదల కాబోతున్న ‘కమ్మప్ప’ మూవీకి నెమ్మది నెమ్మదిగా పాజిటివ్ టాక్ ఏర్పడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన రావడంతో మంచు కాంపౌండ్ హ్యాపీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సి తెలుగు ప్రేక్షకులకు కొత్త అయినప్పటికీ అతడు ట్యూన్ చేసిన పాటలు తెలుగు ప్రజలకు బాగానే నచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.



ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ వాతావరణం అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు సగటు ప్రేక్షకులలో ఏర్పడింది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ ఓటిటి శాటిలైట్ సంబంధించిన డీల్స్ ఇంకా ఏదీ పూర్తికాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మంచు విష్ణు సినిమాలకు ప్రస్తుతం ఎటువంటి మార్కెట్ లేదు.



అయినప్పటికీ విష్ణు ఈ సినిమా మార్కెట్ విషయంలో తన ఇమేజ్ పై ఆధారపడకుండా ఈ సినిమాకు సంబంధించిణ కంటెంట్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ కుమార్ ల ఇమేజ్ తో తన సినిమా గట్టెక్కుతుందని మంచు విష్ణు ధైర్యం అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను శ్రీకాళహస్తిలో భారీ ఎత్తున ఈ నెలాఖరులో నిర్వహించాలని విష్ణు ఆలోచన అని అంటున్నారు.



ఈవెంట్ కు ఇండస్ట్రీకి సంబంధించిన అతిరథ మహారాజులతో పాటు అనేకమంది దర్శకులను మంచు విష్ణు ఆహ్వానిస్తున్నాడని తెలుస్తోంది. ఇండస్ట్రీకి సంబంధించి అనేకమంది ప్రముఖులతో పాటు  అనేకమంది రాజకీయ నాయకులు కూడ వచ్చే అవకాశం ఉండటంతో రాయలసీమ ప్రాంతం అంతా మంచు విష్ణు హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. అయితే నిర్మాతగా మోహన్ బాబు తీస్తున్న అనేక సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పటికీ తన కొడుకు విష్ణు పై ఉన్న నమ్మకం అభిమానంతో మోహన్ బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే..  



మరింత సమాచారం తెలుసుకోండి: