పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడిన మాటలు చాలామందిని ఆకట్టుకున్నాయి.కానీ ఈయన అంటే పడని వారికి మాత్రం ఈ మాటలు తూటాల్లా తగిలాయి. ముఖ్యంగా పవన్ నాగబాబు ఇద్దరు కలిసి టిడిపి పార్టీపై కొన్ని ఇండైరెక్ట్ కామెంట్స్ చేయడంతో టీడీపీలోని కొంతమంది జనసేనపై ఫైర్ అవుతున్నట్టు తెలుస్తోంది.అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రసంగంలో మాట్లాడుతూ దేశమంతా ఒక్కటే దేశాన్ని విభజించాలి అనుకోవడం మంచిది కాదు. తమిళనాడు వాళ్లు హిందీ భాష వద్దు అని మాట్లాడుతున్నారు.కానీ తమిళంలో విడుదలైన సినిమాలను ఎందుకు హిందీలో రిలీజ్ చేస్తున్నారు. హిందీ భాష వద్దని పక్కన పెట్టినప్పుడు హిందీలో తమిళ సినిమాలు కూడా డబ్ చేయకూడదు. 

వారి డబ్బులు కావాలి కానీ భాష మాత్రం వద్దా.. హిందీ భాషకు నేను వ్యతిరేకం కాదు అలాగే తమిళ భాషకు కూడా వ్యతిరేకం కాదు.ధర్మం అనేది అందరికీ ఒక్కటే.మతానికో న్యాయం ఉండాలి అంటే అది ఎప్పటికీ కుదరదు. నేను తీసుకునే ఆలోచనలు ఎప్పుడు కూడా స్పష్టంగానే ఉంటాయి. హిందూ ధర్మం కోసం భారతదేశం కోసం ప్రాణాలు వదిలేయమన్నా కూడా వెనకాడను.ఇతర మతాలను గౌరవించాలి సనాతన ధర్మం తెలిపేది అదే. ఏదైనా విషయం మాట్లాడితే దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దుతున్నారు అంటూ హిందీని సంస్కృత భాషని తిడతారు.

కానీ భాషలన్నీ ఒక్కటే దేశంలో ఉన్న మనుషులందరూ ఒక్కటైతే భాషలన్నీ ఒక్కటి కావా.. ఉత్తరాదిలో ఉన్న హిందీ భాష వద్దు కానీ ఉత్తరాదిలోని చత్తీస్గడ్, బీహార్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల డబ్బులు కావాలా.. భాషని మాత్రం వ్యతిరేకిస్తారా.. ఇదెక్కడి న్యాయం అంటూ పవన్ కళ్యాణ్ తమిళనాడు ప్రజలను మాటలతోనే కడిగిపారేశారు.అయితే తమిళనాడు పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తమిళనాడు జనాలు పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: