
అయితే ఈ అంశం పైన సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. బహుభాష విధానం పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఇలా కౌంటర్ వేస్తూ.. హిందీ భాషను తమ పైన రుద్దకండి అంటూ చెప్పడంలో ఇంకొక భాషను సైతం ద్వేషించడం అన్నట్టు కాదని.. తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.. స్వాభిమానంతోనే మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అంటూ పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ వెల్లడించారు ప్రకాష్ రాజ్.
గతంలో కూడా ప్రకాష్ రాజ్ ,పవన్ కళ్యాణ్ కు మధ్య ఇలాంటి వార్ జరిగింది. ఇప్పుడు మరొకసారి భాషా విధానంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిన్నటి రోజున జనసేన ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలు ఏపీ అంతట వైరల్ గా మారుతున్నాయి..జనసేన కార్యకర్తలు నేతలు కూడా పిఠాపురం కి వచ్చి మరి ఈ సభను చాలా సక్సెస్ ఫుల్ గా చేశారు. మరి 2029 లో కూటమి గానే పోటీ చేస్తారా సింగల్ గా పోటీ చేస్తారా అన్న విషయం చూడాలి మరి.