టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరో స్థాయికి ఎదిగిన నటులలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించకపోయినా ఈ మూవీలోని తన నటనతో పవన్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తరువాత పవన్ ఎన్నో సినిమాలలో నటించి , ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు.

ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఇక తిరుగులేని హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే పవన్ కళ్యాణ్ తన సోదరుడు అయినటువంటి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో కీలక సభ్యుడిగా ఎన్నో పనులను చక్కబెట్టాడు. ఇక ఆ తర్వాత చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశాడు. ఆ తర్వాత కొంత కాలం పాటు పవన్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత పవన్ 2014 వ సంవత్సరంలో జనసేన అనే పార్టీని స్థాపించాడు. ఇకపోతే తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. దానితో పవన్ తాజాగా జనసేన ఆవిర్భావ సభను అత్యంత వైభవంగా నిర్వహించాడు. అందులో భాగంగా పవన్ స్పీచ్ హైలైట్ గా మారింది.

ఇక ఈ స్పీచ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన హీరోలుగా కెరియర్ను కొనసాగిస్తున్న ప్రభాస్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ , చిరంజీవి , రామ్ చరణ్ , సాయి ధరమ్ తేజ్ మరియు నందమూరి అభిమానులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు. అలాగే ఈ స్పీచ్ లో పవన్ కళ్యాణ్ తన అభిమానులను కూడా అభినందించాడు. ఇక జనసేన ఆవిర్భావ సభకి సంబంధించిన పవన్ కళ్యాణ్ స్పీచ్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: