పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరం జనసేన అనే పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఆ సంవత్సరం మాత్రం జనసేన పార్టీ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆ తర్వాత 2019 వ సంవత్సరం జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసింది. కానీ ఎన్నికల్లో జనసేన పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అలాంటి కష్ట సమయంలో కూడా పార్టీని ఎన్నో ఇబ్బందులతో నడిపించాడు.

ఇక 2024 వ సంవత్సరం జనసేన , తెలుగుదేశం , బిజెపి పార్టీలతో కలిసి ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానంలో విజయాన్ని అందుకొని అద్భుతమైన సక్సెస్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరికొన్ని కీలక మంత్రి పదవులలో కొనసాగుతున్నాడు. జనసేన పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పవన్ కళ్యాణ్ తాజాగా జనసేన ఆవిర్భావ సభను అత్యంత గ్రాండ్ గా నిర్వహించాడు. ఈ సభలో భాగంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ అద్భుతమైన స్థాయిలో వైరల్ అవుతుంది. ఇకపోతే పవన్ 2024 ఎన్నికలకు ముందే ఓజి అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాపై ప్రస్తుతం పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దానితో పవన్ ఏ ఈవెంట్ కు వెళ్లిన ఆయన అభిమానులు ఓజి అంటూ అరుస్తూ వస్తున్నారు. దానితో పవన్ కళ్యాణ్ గతంలో అనేక సార్లు అలా అరవకండి. ఆ సినిమా గురించి తర్వాత చూసుకుందాం అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇక తాజాగా జనసేన ఆవిర్భావ సభలో కూడా పవన్ మాట్లాడుతున్న సమయంలో అనేక మంది పెద్దగా ఓజి అంటూ నినాదాలు చేయడం మొదలు పెట్టారు. దానితో పవన్ కళ్యాణ్ ఇక్కడ సినిమాల గురించి నినాదాలు వద్దు. ఓజి సినిమా చూసే సమయంలో థియేటర్లో జనసేన అంటూ నినాదాలు చేయకండి. ఎంతో మంది కష్టం వల్ల జనసేన పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. అందుకని ఈ సమయంలో నినాదాలు చేయకండి అని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: