రికార్డ్స్ క్రియేట్ చేయాలి అన్న.. ఆ రికార్డ్స్ బద్దలు కొట్టాలి అన్న కొంతమంది హీరోలకి సాధ్యమవుతుంది . మన తెలుగు ఇండస్ట్రీలో అలాంటి సత్తా ఉన్న హీరోస్ చాలా తక్కువ . కొందరే ఉన్నారు వాళ్ళల్లో ఒకరే బాలయ్య . నందమూరి హీరో బాలయ్య గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే . రీసెంట్ గానే "డాకు మహారాజ్" సినిమాతో సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు .  బాలయ్య ఇప్పుడు అఖండ 2  సినిమా షూట్స్ లో బిజీగా ఉన్నారు . ఒకపక్క పొలిటికల్ పరంగా మరొక పక్క సినిమాల పరంగా బాలయ్యను ఎవరు టచ్ చేయలేని స్థాయికి ఎదిగిపోతున్నాడు.  ఇలాంటి మూమెంట్లోని బాలయ్య హిట్ కొట్టడమే కాదు ఆయన సెట్ చేసుకున్న సినిమాలు చరిత్ర సృష్టించేలా మార్చేయబోతున్నాడు .


ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. బాలయ్య తీసుకున్న ఒక డెసిషన్ ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కే కాదు సినీ జనాలకి సైతం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . సాధారణంగా స్టార్ హీరోస్ ఎవరైనా సరే సింగిల్ గానే  స్క్రీన్ పై కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు . సింగిల్ రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు . అయితే బాలయ్య మాత్రం అఖండ సినిమా తర్వాత ఏ సినిమా చేసిన సరే అందులో ఒక హీరోని కచ్చితంగా పెట్టుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట .



మల్టీస్టారర్ మూవీ అని చెప్పలేం.. అలా అని బాలయ్య ఒక్కడే లీడ్ రోల్ పోషిస్తారు అని చెప్పలేం . ఆయనతో పాటు వేరే టైర్ టు హీరోస్ కూడా ఆయన సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట . తద్వారా బాలయ్య ఆ హీరోలకి కెరియర్ ఇచ్చినట్లు అవుతుంది . సినిమా ఇండస్ట్రీకి సక్సెస్ ఇచ్చినట్లు అవుతుంది.  ఒక టైర్ 2 హీరో సింగిల్ గా నటించి హిట్ కొట్టాలి అంటే చాలా కష్టం . అదే ఒక బిగ్ స్టార్ తో కలిస్తే మాత్రం అది చాలా ఈజీ అయిపోతుంది.  టైర్ 2 హీరోలు  కెరియర్ లో సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశం కారణంగానే బాలయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట . దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. కేవలం బాలయ్య కాదు గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఇండస్ట్రీ గురించి ఇదేవిధంగా ఆలోచించేవాళ్ళు . మనం బతకడం కాదు మన ద్వారా నలుగురు బ్రతకాలి ..అదే సినిమా ఇండస్ట్రీ అంటే అంటూ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు . నందమూరి బ్లడ్ అంటే అదే అంటూ బాలయ్య తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: