అఖిల్ హీరోగా పరిచయం అయి దాదాపు దశాబద్ధ కాలం అవుతున్నప్పటికీ హిట్ అన్న పదం ఇప్పటికీ అతడు పూర్తిగా చూడలేకపోతున్నాడు. అక్కినేని కాంపౌండ్ వారసుడు కాకపోతే ఈపాటికి అతడి పేరును కూడ చాలామంది మర్చిపోయి ఉండేవారు. సరైన కథ కోసం ఎదురు చూసిన అఖిల్ తన అన్వేషణ ఫలించి రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథతో ముందుకు వస్తున్నాడు. 


ఈమూవీకి లెనిన్ అన్న పేరు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమంలో లెనిన్ పాత్ర అద్వితీయం. అందుకే ఆయన పేరును ఇప్పటికీ ఎంతోమంది కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు దాదాపు రెండు సంవత్సరాలు తరువాత అఖిల్ నటిస్తున్న మూవీకి ‘లెనిన్’ అన్న టైటిల్ ఫిక్స్ చేశారు. 

‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీ దర్శకుడు మురళికిషోర్ అబ్బురు దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఈమూవీని నిర్మిస్తున్నారు. ఈసినిమాను ఒక ప్రముఖ నిర్మాత నిర్మించాలని మొదట్లో భావించాడని తెలుస్తోంది. అయితే ఈకథ నాగార్జున కు బాగా నచ్చడంతో నాగ్ స్వయంగా రంగంలోకి దిగి ఈమూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్ పక్కన హీరోయిన్ గా శ్రీలీల ఎంపిక అయినట్లు సమాచారం. 

లేటెస్ట్ గా మొదలుకాబోతున్న ఈమూవీ షెడ్యూల్ ఏకధాటిగా 20 రోజులు కొనసాగించి ఈమూవీలోని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని టాక్. విదేశాలకు వెళ్లే అవసరం లేకుండా వీలైనంత అధిక శాతం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేస్తారు అని అంటున్నారు. తెలుస్తున్న సమాచరంమేరకు ఈమూవీ కథ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని అంటున్నారు.సరైన కథ కోసం ఎదురు చూసిన అఖిల్ తన అన్వేషణ ఫలించి రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథతో ముందుకు వస్తున్నాడు అనుకోవాలి . ఈ ప్రయత్నం ఎంత వరకు  విజయ  వంతం  అవుతుందో  చూడాలి .  అఖిల్ కు ఈ  సినిమా విజయం  చాలా కీలకంగా  మారబోతోంది 

మరింత సమాచారం తెలుసుకోండి: