
అదే కాకుండా చెన్నై నుంచి అట్లే టీం వచ్చి అల్లు అర్జున్ ని కలవడం ఇంకా హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే అల్లు అర్జున్ - అట్లి కాంబో దర్శకత్వంలో తెరకెక్కే సినిమా అఫీషియల్ ప్రకటన రాబోతుంది అంటూ వార్తలు వినిపించాయి . అంతేకాదు ఉగాది పర్వదినాన ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేయాలి అంటూ డిసైడ్ అయ్యారట చిత్ర బృందం . అయితే ఇప్పుడు సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ అట్లీ సినిమా కూడా పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. ఆ ప్లేస్ లోకి మరో బిగ్ బడా స్టార్ దర్శకుడు వచ్చి చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
ఆయన మరెవరో కాదు బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ "సంజయ్ లీల భన్సాలి". ప్రజెంట్ ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది . పుష్ప2 సినిమా తర్వాత బాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అనేది మనకు తెలిసిందే. స్వయాన సంజయ్ లీల భన్సాలి పిలిచి మరి ఆయనకు స్పెషల్గా కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు . అలాంటి సంజయ్ లీల భన్సాలీ తో ఆఫర్ వస్తే ఏ హీరో కూడా వదులుకోడు .. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే ..పోస్ట్ పోన్ చేసేస్తాడు. ప్రజెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే పని చేసినట్లు తెలుస్తుంది . అల్లు అర్జున్ - అట్లీ దర్శకత్వంలో తరకెక్కే సినిమాని పోస్ట్ పోన్ చేసి సంజయ్ లీల భన్సాలితో మూవీకి కమిట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..???