విజయ్ దేవరకొండ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈయన పేరు తెలియని వారు ఉండరు.. రౌడీ హీరోగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు.. అలాంటి ఈయన ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు. కానీ ఆయనకు ఇద్దరు పిల్లలు పుట్టారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు ఆ పిల్లలకు పెట్టే పేర్ల విషయంలో  కాస్త గొడవ కూడా జరిగినట్టు తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నారు. అయితే ఈయన ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్ అయినటువంటి రష్మిక మందానతో డేటింగ్ చేస్తున్నారని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతే కాదు వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటవుతారని కూడా అంటున్నారు. ఇలా వార్తలు వస్తున్న తరుణంలో విజయ్ దేవరకొండకు ఇద్దరు పిల్లలు పుట్టారని  ఒక వార్త నెట్టింటా విపరీతంగా చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆయన తాజాగా సత్యం స్టీల్ కంపెనీ అనే ఒక యాడ్ చేశారు. ఈ ప్రకటనలో విజయ్ దేవరకొండ హాస్పిటల్ లో కూర్చుని టెన్షన్ పడుతూ ఉంటాడు. అక్కడే విజయ్ దేవరకొండ నాన్న మామయ్య, అమ్మ అత్తా కూర్చొని ఉంటారు.. వాళ్లు తనకు పుట్టబోయే బిడ్డల గురించి ఏ పేరు పెట్టాలో గొడవ పడుతూ ఉంటారు.   ఇంతలో ఒక నర్స్ ఒక బిడ్డని ఎత్తుకొని బయటకు వస్తుంది.

ఆ తర్వాత కొంతసేపటికి మరో బిడ్డను ఎత్తుకొని మరో నర్సు నడుస్తుంది. ఇద్దరు పిల్లలకు ఆ రెండు పేర్లు పెట్టేస్తారు. రిలేషన్షిప్స్ బలంగా ఉంటే ఆ దేవుడు మనకి అండగా నిలబడతాడు అంటూ విజయ్ దేవరకొండ చెబుతూ సత్యం స్టిల్స్ కూడా అంత దృఢమైనది అంటూ హిందీలో డైలాగ్ చెబుతాడు. అయితే ఈ ప్రకటనను  విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా  విపరీతంగా వైరల్ అవుతుంది. ఇందులో విజయ్ దేవరకొండను చూసినటువంటి అభిమానులు మీకు నిజ జీవితంలో కూడా ఇలాంటి ఇద్దరు పిల్లలు పుట్టాలని కామెంట్స్ పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: