
తాజాగా సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా తో తన కెరీర్ లో వరుసగా ఎనిమిదో హిట్ వేసుకున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక అనిల్ రావిపూడి తర్వాత సినిమా మెగాస్టార్ చిరంజీవి తో నే ఉంటుందన్నది తెలిసిందే. సాహు గారపాటి నిర్మించే ఈ క్రేజీ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం చకచకా నడుస్తున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి తన సెంటిమెంట్ ప్రకారం విశాఖ వెళ్లి అక్కడే ఫస్టాఫ్ స్టోరీ లాక్ చేసుకుని వచ్చినట్టు సమాచారం.
ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అయితే చాలా వేగంగా నడుస్తున్నాయట. ఇదే టైం ఎట్టి పరిస్థితుల్లోలనూ వచ్చే సంక్రాంతి కే రిలీజ్ చేయాలన్న టార్గెట్ తో మరో వైపు కాస్టింగ్ పనులు కూడా చకచకా చేస్తున్నారట. కనీసం 80 రోజుల వర్కింగ్ డేస్ లో సినిమాను కంప్లీట్ చేయాలన్న టార్గెట్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లోగా చిరు విశ్వంభర సినిమా కోసం ప్యాచ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాల్సి ఉంది. మరో రెండు నెలల్లో కాస్టింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి చేయసే పనిలో అనిల్ ఉన్నాడడట. చిరు పక్కన ఒకే ఒక్క హీరోయిన్ ఉంటారు ? ఆమె ను ఎవరిని తీసుకోవాలి ? అన్న దాని మీద కూడా కసరత్తులు నడుస్తున్నాయట.
దాదాపు ఏడుగురు హీరోయిన్ల పేర్లు చర్చల్లో ఉన్నాయి. అయితే అదిథి రావు హైదరీ పేరు టాప్ ప్రయార్టీలో ఉందని అంటున్నారు.. ఆమె ఎవరో కాదు .. హీరో సిద్ధార్థ్ కు స్వయానా భార్య .. పైగా హైదరాబాదీ తెలుగు అమ్మాయే ... ఐశ్వర్య రాజేష్ లా మరోసారి తెలుగ మ్మాయి తోనే అనిల్ సినిమా తీస్తున్నాడని అనుకోవాలి.