విజయ్ వర్మ తమన్నా బ్రేకప్ కి కారణం అదే అని ఇదే అని ఇలా ఎన్నో రూమర్లు తెర మీద వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్లో వీరి బ్రేకప్ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అయితే రీసెంట్గా బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఇంటికి హోలీ సెలబ్రేషన్స్ కోసం తమన్నా వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే విజయ్ వర్మ కూడా ఓ అమ్మాయితో కలిసి వచ్చాడు. దీంతో వీరిద్దరూ కలిసి హోలీ పండగ జరుపుకున్నారని ఇద్దరు కలిసే ఉన్నారని కొంతమంది అనుకున్నారు. కానీ వీరిద్దరూ కలిసి ఉన్నారు అనేదాంట్లో నిజం లేదు. ఎందుకంటే కలిసే ఉంటే ఇద్దరూ కలిసి హోలీ జరుపుకొని ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వచ్చేవారు. కానీ వేరువేరుగా ఎందుకు వచ్చారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 అయితే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం తెలుగు హీరో అని,తమిళ హీరో అని, బాలీవుడ్ హీరో అని ఇలా ఎన్నో రూమర్లు తెర మీద వినిపించాయి. అంతేకాకుండా పెళ్లి విషయంలో తమన్నా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్లే పెళ్లి ఇప్పుడే చేసుకోవడం ఇష్టం లేని విజయ్ వర్మ తమన్నాకి బ్రేకప్ చెప్పాడని ఓ రూమర్ మీడియాలో వినిపించింది. అయితే తాజాగా మరొక రూమర్ తెరపైన వినిపిస్తోంది. అదేంటంటే తమన్నా ప్రియుడు విజయ్ వర్మ మరో నటితో డేటింగ్ లో ఉన్నాడని వారిద్దరి మధ్య ఉన్న ఎఫైర్ విషయం తెలిసే తమన్నా పక్కకు తప్పుకుంది అంటూ బీటౌన్ లోని కొన్ని వెబ్సైట్స్ బహిరంగంగానే రాసుకోస్తున్నాయి.

మరి ఇంతకీ విజయ్ వర్మ తిరుగుతున్న  ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే బాలీవుడ్ నటి కృతి సనన్.. అయితే విజయ్ వర్మ కృతి సనన్ మధ్య డేటింగ్ రూమర్లు చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం రీసెంట్గా జైపూర్ లో ఐఫా అవార్డ్స్ ఈవెంట్ గ్రాండ్గా జరిగిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఐఫా అవార్డ్స్ వేడుకల్లో విజయ్ వర్మ తమన్నాతో కలిసి రాలేదు. ఒకవేళ తమన్నాతో రాకపోయినా ఒంటరిగా వచ్చినా కూడా ఈ రూమర్లు వినిపించేవి కాకపోవచ్చు. కానీ విజయ్ వర్మ తమన్నాతో కాకుండా నటి కృతి సనన్ తో సన్నిహితంగా ఉంటూ ఆ ఈవెంట్లో పాల్గొన్నారు. దీంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు బాలీవుడ్లో రూమర్లు వినిపిస్తున్నాయి. అలాగే కృతి సనన్ తో విజయ్ వర్మ డేటింగ్ చేయడం వల్లే తమన్నాని పక్కన పెట్టాడని తమన్నా కూడా విజయ్ ని వదిలేసింది అంటూ రూమర్లు ప్రచారం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: