టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. డిస్ట్రిబ్యూషన్ రంగంలో దిల్ రాజు ఎన్నో అపజయాలను మొదట ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మంచి సక్సెస్ లను అందుకున్నాడు. ఇక డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను చాలా సంవత్సరాల పాటు కొనసాగించిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలను నిర్మించడం మొదలు పెట్టాడు.

ఇక నిర్మాతగా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలపాటు అపజయం అంటూ ఎరగని నిర్మాతగా దిల్ రాజు కెరియర్ ను కొనసాగించాడు. దానితో ఆయన క్రేజ్ , ఆయన బ్యానర్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో పెరిగిపోయింది. ఇకపోతే దిల్ రాజు నిర్మించిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకున్న మూవీ లు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి మూవీలలో కృష్ణాష్టమి మూవీ ఒకటి. సునీల్ ఈ సినిమాలో హీరో గా నటించిన వాసు వర్మమూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు కొంత కాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో భాగంగా కృష్ణాష్టమి సినిమా ఫ్లాప్ కావడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... కోనా వెంకట్ మాకు ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కథను అందించాడు.

దానితో వాసు వర్మ దర్శకత్వంలో నేను ఓ సినిమా చేయాలి అనుకున్నాము. కానీ మాకు హీరో సెట్ అయ్యే లోపు చాలా టైమ్ దొరికింది. దానితో మేము కథలో అనేక మార్పులు , చేర్పులు చేశాం. ఆ తర్వాత సునీల్ ను హీరోగా పెట్టుకొని కృష్ణాష్టమి అనే టైటిల్ తో సినిమా చేసాము. కానీ మేము చేసిన మార్పుల వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది అని దిల్ రాజు తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: