తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ వస్తున్నారు. కానీ అలా ఎంట్రీ ఇస్తున్న వారిలో చాలా తక్కువ మందికి మాత్రమే మొదటి సినిమాతో విజయాలు దక్కుతున్నాయి. ఇక ఎవరైనా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు అంటే వారికి మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది. అదే ముద్దుగుమ్మ కనుక ఏకంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన మూడు సినిమాలతో కూడా అద్భుతమైన విజయాలు అందుకున్నట్లయితే ఆ హీరోయిన్ కి క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అలా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూడు సినిమాలతో అద్భుతమైన విజయాలను అందుకున్న ఓ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం పెద్దగా సినిమా అవకాశాలు లేక ఇతర భాష సినిమాలలో నటిస్తోంది. మరి ఆమె ఎవరో తెలుసా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు కృతి శెట్టి. ఈమె ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఈమెకు అదిరిపోయే రేంజ్ క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో వచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు మూవీలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

ఇలా ఈమె నటించిన మొదటి మూడు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి చాలా తక్కువ సమయంలో చేరుకుంటుంది అని చాలా మంది భావించారు. కానీ ఆ తర్వాత మాత్రం ఈమె నటించిన సినిమాలు వరుస పెట్టి బోల్తా కొడుతూ వచ్చాయి. ఆఖరుగా ఈమె తెలుగు లో మనమే అనే సినిమాలో నటించింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు కంటే కూడా ఇతర భాష సినిమాలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: