అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 చిత్రం గత ఏడాది డిసెంబర్ 5న  విడుదలై ఎలాంటి విజయాన్ని అందుకున్నదో తెలియజేయాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి సుమారుగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ కాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డులను సైతం సృష్టించింది. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా తర్వాత రెండవ స్థానాన్ని సంపాదించుకుంది పుష్ప 2. వీటితో పాటుగా RRR, కే జి ఎఫ్, బాహుబలి వంటి చిత్రాల రికార్డులను కూడా తిరగరాసింది.


ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి వంద రోజులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మేకర్ నిన్నటి రోజున ఒక స్పెషల్ వీడియోని సైతం రిలీజ్ చేయడం జరిగింది. ఇండియన్ సినీ ఇండస్ట్రీ పుష్ప 2 ది రూల్ సినిమా 100 డేస్ అంటూ ఒక క్యాప్షన్ తో వీడియోని షేర్ చేశారు.. బాక్సాఫీస్ వద్ద రికార్డు బద్దలు కొట్టిన పుష్ప సినిమా ఇండియన్ సినిమాలను మరొకస్థాయికి తీసుకువెళ్ళింది అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.


ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్త్రిమ్మింగ్ అవుతున్నది. 2021 లో వచ్చిన పుష్ప చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కించారు. ఇందులో రష్మిక హీరోయిన్గా నటించగా అనసూయ, సునీల్, రావు రమేష్ తదితర నటీనటులు నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా పాటలు ఇప్పటికీ కూడా భారీగానే పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. ఇక డైలాగ్ లు కూడా ఇతర దేశాలలో కూడా భారీ క్రేజ్ ని సంపాదించుకున్నాయి. ఇప్పటికీ అక్కడక్కడ ఈ చిత్రానికి సంబంధించి రిల్స్ వీడియోలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మొత్తానికి అటు విమర్శలతో బాక్సాఫీస్ ని మాత్రం అల్లు అర్జున్ పుష్ప , పుష్ప 2 తో షేక్ చేశారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: