సినిమా ఇండస్ట్రీ లో హీరోల కెరియర్ తో పోలిస్తే హీరోయిన్ల కెరియర్ ఎక్కువ సమయం ఉండదు అనే వాదనను అనేక మంది అనేక సందర్భాలలో వినిపించారు. ఇది అనేక మంది విషయంలో రుజువు కూడా అయింది. హీరోలు అనేక సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ కొనసాగించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ హీరోయిన్లలో ఈ సంఖ్య అత్యంత తక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇకపోతే హీరోలతో పాటు సరి సమానంగా అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మలలో మొదటి వరుసలో త్రిష , నయనతార కనబడతారు.

వీరు చాలా సంవత్సరాల క్రితం హీరోయిన్లుగా కెరియర్ను మొదలు పెట్టారు. హీరోయిన్లుగా కెరియర్ను మొదలు పెట్టిన తక్కువ సమయంలోనే విరు అద్భుతమైన స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడు వెనక్కు తిరిగి చూసుకోకుండా కెరియర్ను ముందుకు సాగించారు. ఇప్పటికీ కూడా ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగి స్తున్నారు. వీరు పేరుకు సీనియర్స్ హీరోయిన్స్ అయినా కూడా యంగ్ బ్యూటీస్ కి ఏ మాత్రం తగ్గకుండా పారితోషకం తీసుకుంటున్నారు.

అదే రేంజ్ లో సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటున్నారు. ఇక ఓ వైపు వీరు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలలో , వైవిద్యమైన సినిమాలలో నటిస్తూ తమ నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. దానితో వీరి క్రేజ్ సినిమా సినిమాకి మరింతగా పెరుగుతూ వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం నయనతార తెలుగు కంటే తమిళ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. త్రిష కూడా తెలుగు తో పోలిస్తే తమిళ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం త్రిష , చిరంజీవి హీరో గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: