టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు . ఈయన డాన్ శీను అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పె ట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నా డు . ఆ తర్వాత ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు . అందులో అనేక సినిమాలు మంచి విజయాలను కూడా అం దుకున్నాయి. ఆఖరుగా ఈయన బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి అనే సినిమాను రూపొందించాడు . ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.

ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ మలినేని బాలీవుడ్ నటుడు అయినటువంటి సన్నీ హీరోగా జాట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్నారు. గాదర్ 2 భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సన్నీ లియోన్ హీరో గా రూపొందుతున్న మూవీ కావడం , వీర సింహా రెడ్డి మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొని ఉండడంతో ఈ మూవీ కి డిజిటల్ హక్కుల ద్వారా భారీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ ఏకంగా 40 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వారాల థియేటర్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: