చిత్ర పరిశ్రమ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి హీరో గా ఎదుగారు శివాజీ .  విలక్షణ న‌టుడి గా పేరు తెచ్చుకున్నారు .. రాష్ట్ర విభ‌జ‌న తర్వాత జరిగిన పరిణామాలు ఆ సమయంలో బలమైన గొంతుకగా ప్రజల నుంచి వినిపించారు శివాజీ .. ఇక ఒకానొక సమయంలో టిడిపి మనిషిగా కూడా ఆయన పై ముద్ర పడింది .. అయితే తనకు పార్టీల తో సంబంధం లేదని అన్యాయాన్ని ప్రశ్నించే ప్రజల గొంతుక గా మారతానని త‌న‌ లక్ష్యాన్ని శివాజీ ప్రకటించారు .. ఇలా దాదాపు 12 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శివాజీ బిగ్ బాస్ షో తో మళ్లీ ఇండస్ట్రీలోకి వచ్చారు ..


అలాగే 90 వెబ్ సిరీస్ కూడా ఆయన రీఎంట్రీ కి మంచి ప్లాట్ఫారం గా మారింది .. ఇక ఇప్పుడు తాజాగా కోర్ట్ సినిమాలో ఆయన చేసిన మంగపతి పాత్రకి మంచి రెస్పాన్స్ కూడా దక్కుతుంది .. ఇక ఈ సినిమాలో హైలెట్గా నిలిచే పాత్ర శివాజీ ది అంటూ ప్రశంసలు కూడా వస్తున్నాయి .. దాదాపు 20 ఏళ్లుగా ఇలాంటి పాత్ర కోసం ఆయన ఎదురు చూశాని .. ఇక ఈ సినిమాతో తన కల నెరవేరిందని కూడా చెప్పుకొచ్చారు శివాజీ .ఇదే సమయంలో రాజకీయాల గురించి కూడా తనదైన స్టైల్ లో స్పందించారు ..


తాను ఎప్పుడూ ఏ పార్టీని బలోపేతం చేయాలని పనిచేయలేదు . తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకుడు చంద్రబాబు .. వైసీపీకి జగన్  .. జనసేనకి పవన్ కళ్యాణ్ ఉన్నారు .. వారు వారీ పార్టీల్ని స్ట్రాంగ్ గా ముందుకు నడిపించగలరు .. అయితే ఇక్కడ బలహీనంగా ఉన్నది ప్రజలే .. ప్రజలకు దారుణంగా అన్యాయం జరుగుతున్నప్పుడు స్పృహ కలిగిన  మనిషిగా మాట్లాడుతాను తప్ప నాకు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు .  ఎప్పటికీ నాది ప్రజల పక్షమే అంటూ శివాజీ ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ లో తన మనసులో మాటను బయటపెట్టారు .

మరింత సమాచారం తెలుసుకోండి: