మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతోంది. దీంతో ఈ మధ్యనే సంక్రాంతి వస్తున్నాం సినిమాతో భారీ హిట్టు కొట్టడంతో అనిల్ రావిపూడి పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు ఈయన తీసిన ఎనిమిది సినిమాలు కూడా అన్ని హిట్సే.దాంతో చిరంజీవి అనిల్ కాంబోలో రాబోయే సినిమాపై అభిమానుల్లో చాలా క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే సీనియర్ హీరోలైనా బాలకృష్ణ,వెంకటేష్ లు ఈయన డైరెక్షన్లో సినిమాలు తీసి హిట్స్ కొట్టారు. ఇప్పుడు చిరంజీవి వంతు అయింది.ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.ఈ షూటింగ్ దశలో ఉండగానే అనిల్ రావిపూడి తో నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్ళబోతుంది. ఈ నేపథ్యంలోనే అనిల్ రావిపూడి చిరంజీవి కోసం ఒక కత్తిలాంటి ఫిగర్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 అయితే సీనియర్ హీరోలకి హీరోయిన్లను సెట్ చేయడం దర్శకులకు చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే ఏజ్ గ్యాప్ తో పాటు కాంబో కరెక్ట్ గా సెట్ అవ్వాలి అంటే కాస్త ఇబ్బంది పడాల్సిందే. అలా ఇప్పటికే చిరంజీవి నయనతార, తమన్నా, కాజల్ అగర్వాల్, శృతిహాసన్ వంటి హీరోయిన్లతో నటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే సినిమాకి హీరోయిన్ గా అదితి రావు హైదరీ ని ఫిక్స్ చేసినట్టు టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే అదితి రావు హైదరి చిరంజీవి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది.ముఖ్యంగా  చిరంజీవి సరసన ఈ హీరోయిన్ సెట్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే గతంలో జై చిరంజీవా సినిమాలో మెగాస్టార్ సరసన భూమిక, సమీరా రెడ్డి హీరోయిన్స్ గా చేశారు. 

కానీ ఇందులో భూమిక చిరంజీవికి అస్సలు సెట్ కాలేదు అని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చిరంజీవి సినిమాలో హీరోయిన్గా అదితి రావు హైదరీ నటించబోతుంది అనే వార్త వినిపించిన సమయంలో కూడా భూమిక చిరంజీవి కాంబోనే గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో వారి కాంబో సెట్ అవ్వలేదు.మరి ఇప్పుడు వీరి కాంబో సెట్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ మరి కొంత మంది మాత్రం అనిల్ రావిపూడి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని అనిల్ రావిపూడి వీరి మధ్య కాంబో ఎలాగైనా సెట్ చేస్తాడు అది ఆయన చేసే మ్యాజిక్..రీసెంట్గా వచ్చిన సంక్రాంతి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ కన్నా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు వయసులో చాలా చిన్నవాళ్లు.అయినప్పటికీ వారి కాంబో ని సెట్ చేసి స్క్రీన్ పై మ్యాజిక్ చూపించాడు. చిరంజీవి విషయంలో కూడా ఆ మ్యాజిక్ చేయబోతున్నాడు కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: