మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకు ఈమె ఎన్నో భాషల సినిమాల్లో నటించి అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీమణులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం పుష్ప పార్ట్ 2 అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన ఛావా సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కూడా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా వరుసగా ఈమె నటించిన సినిమాలు అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకోవడంతో ఈమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాలను వదిలేసింది. అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన విజయాలు అందుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ప్లాప్ అయ్యాయి. ఈ బ్యూటీ వదిలేసిన సినిమాలలో బాక్సా ఫీస్ దగ్గర భారీ అపజయాలను అందుకున్న సినిమాలేవో తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ ఆచార్య అనే మూవీని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా పూజా హెగ్డే నటించింది. ఇకపోతే ఈ సినిమాలో చరణ్ కు జోడిగా మొదట రష్మికను అనుకున్నారట. కానీ ఆమె ఈ సినిమాలో పాత్రను రిజెక్ట్ చేసిందట. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

ఇకపోతే తమిళ నటుడు దళపతి విజయ్ కొంత కాలం క్రితం బీస్ట్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో రష్మికను మొదటగా హీరోయిన్గా అనుకున్నారట. ఈ సినిమా ఆఫర్లు ఈ ముద్దు గుమ్మ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: