సినిమా ఇండస్ట్రీ లో భారీ క్రేజ్ ఉన్న సినిమాలు దాదాపు వారం తేడాతో విడుదల అవుతూ ఉంటాయి. అలా భారీ క్రేజ్ ఉన్న సినిమాల విడదల తేదీల మధ్య గ్యాప్ కాస్త ఎక్కువ ఉండేలా మేకర్స్ పక్కాగా ప్లానింగ్ చేస్తూ ఉంటారు. అందుకు ప్రధాన కారణం మంచి క్రేజ్ ఉన్న సినిమాలు అత్యంత దగ్గర తేదీల్లో విడుదల అయినట్లయితే నిర్మాతలకు ఆ సినిమాలకు థియేటర్లను అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది. ఒక వేళ ధియేటర్లను అడ్జస్ట్ చేసినా కూడా ఆ తర్వాత అన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినట్లయితే ఏ సినిమాకు కూడా భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉండవు.

అదే ఏదైనా ఒక సినిమాకు యావరేజ్ టాక్ వచ్చిన కూడా ఆ మూవీ కి పెద్దగా కలెక్షన్లు వచ్చే ఛాన్సెస్ ఉండవు. దానితో నిర్మాతలు మంచి క్రేజ్ ఉన్న సినిమాల విడుదల తేదీల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే మార్చి నెలలో రెండు తేదీల్లోనే మూడు క్రేజీ సినిమాలు విడుదల కావడానికి రెడీ అవుతున్నాయి. మార్చి 27 వ తేదీన తమిళ నటుడు విక్రమ్ హీరో గా రూపొందిన వీర ధిర శుర సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం మ్యాడ్ మూవీ రూపొంది మంచి విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన మ్యాడ్ స్క్వేర్ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ మూవీపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే నితిన్ హీరోగా రూపొందిన రాబిన్ హుడ్ సినిమాను కూడా మార్చి 28వ  తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా మంచి అంచనాలు కలిగిన ఈ మూడు సినిమాలు కేవలం ఒకే రోజు తేడాతో విడుదల కానున్నాయి. మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: