టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు మూవీ లను నిర్మిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన వరుస పెట్టి సినిమాల్లో హీరో పాత్రల్లో నటిస్తూనే ఓ వైపు నిర్మాత గా సినిమాలను కూడా నిర్మిస్తూ వస్తున్నాడు. ఇకపోతే నటుడిగా నాని ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాడో నిర్మాత గా కూడా అదే రేంజ్ లో సక్సెస్ అయ్యాడు. ఈయన బ్యానర్ నుండి ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా నాని "కోర్టు" అనే మూవీ ని రూపొందించాడు.

మూవీ విడుదలకు ముందు నాని ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ ... కోర్ట్ మూవీ అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంటుంది. ఆ సినిమా కనుక మిమ్మల్ని అలరించకపోతే మరికొన్ని రోజుల్లో విడుదల కాబోయే నా హిట్ 3 సినిమాను ఎవరు చూడకండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా నాని భారీ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా నిన్న అనగా మార్చి 14 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్స్ ను ఈ మూవీ విడుదలకు రెండు రోజుల ముందు ఈ మూవీ యూనిట్ వారు ప్రదర్శించారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే అద్భుతమైన టాక్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి విడుదల అయిన మొదటి రోజు కూడా మంచి టాక్ వచ్చింది. అలాగే మొదటి రోజు ఈ మూవీ కి అద్భుతమైన ఓపెనింగ్లు కూడా లభించాయి.

ఇకపోతే నాని మరికొన్ని రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందబోయే సినిమాను నిర్మించబోతున్నాడు. ఇలా నాని ఇప్పటి వరకు నిర్మించిన సినిమాలలో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను సాధించడంతో చిరంజీవి , శ్రీకాంత్ కాంబోలో తెరక్కపోయే సినిమాపై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: