సినిమా ఇండస్ట్రీ లో అత్యంత డేంజర్ జోన్ లో ఉండేది డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలు అని అనేక మంది చాలా సందర్భాలలో చెప్పారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం నిర్మాతగా , డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్న వారిలో దిల్ రాజు ఒకరు. ది రాజు సినిమా పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టాడు. ఆ తర్వాత నిర్మాతగా సినిమాలను నిర్మించాడు. ఇకపోతే నిర్మాణ రంగంలో అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన ఈయన ఇప్పటికీ కూడా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఒకా నొక ఇంటర్వ్యూలో భాగంగా ఈయనకు మీరు కేవలం డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే కెరియర్ను కొనసాగించి ఉండుంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఉండేవారా అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన ఖచ్చితంగా నేను కేవలం డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను కొనసాగించి ఉంటే ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో కొనసాగే వాడిని కాదు. నేను నిర్మాతగా కూడా కొనసాగుతున్నాను కాబట్టే ఇండస్ట్రీ లో ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నాను అని ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే అందుకు ఒక ఉదాహరణను కూడా ఈయన చెప్పుకొచ్చాడు. దిల్ రాజు ఉదాహరణ గురించి మాట్లాడుతూ ... నేను 2017 వ సంవత్సరం పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అజ్ఞాతవాసి , మహేష్ బాబు హీరోగా రూపొందిన స్పైడర్ సినిమాల థియేటర్ హక్కులను కొనుగోలు చేశాను.

ఇక ఆ మూవీలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు. దానితో నాకు ఆ రెండు సినిమాల ద్వారా దాదాపుగా ఆ సంవత్సరం 25 కోట్ల నష్టం వచ్చింది. ఇక అదే సంవత్సరం నేను నిర్మించిన చాలా సినిమాలు విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాలతో నాకు భారీ లాభాలు వచ్చాయి. దానితో ఆ మూవీల ద్వారా వచ్చిన నష్టాలను నేను ఈ సినిమాల ద్వారా లాభాలతో సర్దుకున్నాను అని దిల్ రాజు ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: