
అయితే పెళ్లి తర్వాత మాత్రం శోభిత ధూళిపాల పూర్తిగా మార్చేసింది. కేవలం హోమ్లీగా ఉండే రోల్స్ చూస్ చేసుకుంటుంది . అయితే శోభిత ధూళిపాళ్ళ తాజాగా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసుకుంది. ఎప్పుడు కూడా శోభిత ధూళిపాళ్ళ - నాగచైతన్యత ఫోటో షేర్ చేసిన విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు. చూడడానికి అక్క తమ్ముడిలా ఉన్నారు అని .. మీరు అసలు భార్యాభర్తలే కాదు అని.. అసలు మీలో రొమాంటిక్ యాంగిల్ లేదు అని .. నాగచైతన్యకు సమంత అంటేనే ఇష్టం అని.. సమంత తోనే రొమాంటిక్ గా ఫోజులు ఇచ్చేవాడు అని ..
అసలు మీరు చెయ్యి చెయ్యి పట్టుకుని తిరిగిన సందర్భాలలో లేవు అని..దారుణాతి దారుణంగా ట్రోల్ చేశారు . అయితే తాజాగా శోభిత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో మాత్రం అభిమానులను ఫుల్ ఖుషి చేస్తుంది . తన భర్త నాగచైతన్యతో దిగ్గిన కొన్ని పిక్స్ షేర్ చేసింది . అలాగే అతనితో క్లోజ్ గా దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది . పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం కొంచెం క్లోజ్ గా దిగిన ఫోటో ఇదే కావడం గమనార్హం. దీంతో శోభిత ఇప్పుడిప్పుడే సమంత ను మర్చిపోయాలా చేస్తుంది అంటున్నారు జనాలు . ఫస్ట్ టైం పెళ్లి తర్వాత శోభిత ధూళిపాల పేరు పాజిటివ్గా కామెంట్స్ దక్కించుకోవడంతో ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్ గా మారింది . అంతేకాదు శోభిత - అక్కినేని నాగచైతన్య లుక్స్ కూడా ఈ పిక్ లో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అంటూ పొగిడేస్తున్నారు జనాలు..!