సాయి పల్లవి,నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించినటువంటి చిత్రం తండేల్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ చందు మండేటి తెరకెక్కించారు. బాక్స్ ఆఫీస్ వద్ద 100 క్లబ్బులో చేరింది. ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ ఛానల్ నెట్ ఫ్లిక్ లో ట్రిమ్మింగ్ కావటానికి ఈ సినిమా పైన ప్రముఖ రచయిత నటుడు పరుచూరి గోపాలకృష్ణ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. నిరంతరం పరుచూరి పాటలు అనే పేరుతో సంబంధించిన పలు రకాల వీడియోలు కూడా తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి తండేల్ సినిమాపై తన అభిప్రాయం ఏంటో ఇప్పుడు చూద్దాం.


తండేల్ సినిమా చూస్తున్నప్పుడు ఏఎన్ఆర్ మూగమనసులు సినిమా గుర్తుకు వస్తోందని.. చిత్ర బృందం చెప్పినట్లే ఇందులో యాక్షన్, రొమాంటిక్ ,త్రిల్లింగ్ అంశాలు చాలానే ఉన్నాయి. తుఫాను సమయంలో మత్స్యకారులను సముద్రంలో గుర్తించడం కష్టము దీంతో వేరే దేశాలకు వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్ళిన వారి పరిస్థితి ఏంటి అన్న కథంశంతో చాలా అద్భుతమైన ప్రేమ కథను సృష్టించారు.. ఈ సినిమా శ్రీకాకుళ ప్రాంతానికి చెందిన కొంతమంది మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ కు చిక్కిన సంఘటన ఆధారంగా డైరెక్టర్ చందు మొండేటి బాగా తెరకెక్కించారని..



నాగచైతన్య బాడీ లాంగ్వేజ్ లేదు అనుకున్నాను కానీ ఈ సినిమాకి తగ్గట్టుగానే మాస్గా కనిపించారని తెలిపారు. నాగచైతన్య 100 కోట్ల క్లబ్లో చేరడం మామూలు విషయం కాదని.. ఇక హీరోయిన్ ఒంటరిగా కూర్చుని బాధపడుతూ చూపించ తిరు సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకులను చాలా ఎక్సైటింగ్ గా చేసిందని.. సాయి పల్లవి అద్భుతమైన నటి అని మరొకసారి నిరూపించుకుందని. ఇది ప్రేమ కథ అని ముందే తెలిసినప్పటికీ కూడా ఇందులో హీరోయిన్ కు మరో వ్యక్తితో పెళ్లి అని ఒక ఎపిసోడ్ని చాలా ఉత్కంఠ పరిచేలా చేశారు.. పాకిస్తాన్ లో చిక్కుకున్న హీరో తిరిగి వస్తారా? లేదా? అనేది చాలా ఉత్కంఠ పరిచింది. ప్రీ క్లైమాక్స్ బాగానే ఉంది 22 మందిలో ఒకరు లోపలే ఉండిపోతే ఆయన కోసం హీరో వెళ్లే విషయంలో కూడా దర్శకుడు తీసిన సన్నివేశాలు హ్యాట్సాఫ్ చెప్పేలా ఉన్నాయని తెలిపారు. ఐక్యమత్యం గురించి చెప్పిన సన్నివేశాలు మనసుకి బాగా హత్తుకున్నాయని.. ఇలా ఎన్నో హృదయాలను ప్రేక్షకులను హత్తుకున్నాయని అద్భుతమైన సినిమా తీసినందుకు నాగచైతన్యకు పరుచూరి హాట్సాఫ్ తెలియజేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి: