
గుత్తా జ్వాలా మాట్లాడుతూ నితిన్ సినిమాలో యాక్ట్ చేయడానికి ముందె నాకు చాలా సినిమాలలో ఆఫర్లు వచ్చాయని తెలిపారు. మన సినిమాలలో యాక్టింగ్ చేయాలంటే తెల్లగా ఉంటే చాలని బ్యాడ్మింటన్ లో రాణిస్తున్న సమయంలోనే సినిమాల్లో ఆఫర్లు వచ్చాయని గుత్తా జ్వాలా పేర్కొన్నారు. వాటికి నేను నో చెప్పడం కూడా జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. సినిమా అనేది నేను ఎప్పుడూ ఊహించలేదని గుత్తా జ్వాలా తెలిపారు.
సినిమా రంగంలో నాకెంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఉంటే ఎలా ఉండాలో వారిని చూస్తే అర్థమవుతుందని ఆమె అన్నారు. నేను వారిలా ఉండలేనని సినిమాల్లో ఉండాలంటే మనం ఎంతో మారాలని సిగ్గు అనేది ఉండకూడదని గుత్తా జ్వాలా వెల్లడించారు. ఎన్నో విషయాల్లో సర్దుకుపోతూ ఉండాలని ఇప్పుడు నా భర్త సినిమాల్లోనే ఉన్నారని ఆమె అన్నారు.
మేము 10 గంటల పాటు ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత రెస్ట్ తీసుకోవచ్చని గుత్తా జ్వాలా వెల్లడించారు. నితిన్ మూవీ గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంటుందని ఆ సినిమా సక్సెస్ సాధించడం సంతోషాన్ని కలిగించిందని ఆమె అన్నారు. నితిన్ నాకు మంచి ఫ్రెండ్ అని మొదట ఆ సాంగ్ చేయనని చెప్పానని గుత్తా జ్వాలా కామెంట్లు చేశారు. గుత్తా జ్వాలా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితిన్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.