అక్కినేని అఖిల్ ..సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా సెటిల్ అయిపోదామంటూ అనుకున్నాడు.  కానీ అది మాత్రం కుదరలేదు . తాత పెద్ద హీరో . నాన్న కూడా పెద్ద హీరోనే . కానీ ఇండస్ట్రీలో మాత్రం హీరోగా హిట్ కొట్టలేకపోయాడు అఖిల్ . ఎన్ని సినిమాలల్లో నటించాడో అందరికీ తెలుసు . కానీ మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయాడు . దానికి కారణం ఆయన చూస్ చేసుకునే కథలు . ఆయన చూస్ చేసుకునే కథలు అంతగా తన బాడీకి సూట్ కావు అంటూ ఉంటారు అభిమానులు . ఎలాగోలో అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్నాడు .


కానీ ఈ హిట్ కి సంబంధించిన సక్సెస్ మొత్తం పూజ హెగ్డే ఖాతాలోనే పడిపోయింది . ప్రజెంట్ అఖిల్ కొందరు డైరెక్టర్స్ తో మూవీ లైన్స్ ని  ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు.  అంతేకాదు త్వరలోనే అఖిల్ - జైనబ్  రవ్జీ పెళ్లి చేసుకోబోతున్నారు . ఇన్నాళ్లు మార్చి నెలలో వీళ్ల పెళ్లి జరగబోతుంది అంటూ ప్రచారం జరిగిన..  ఎక్కడా కూడా ఆ సందడే లేదు . దీంతో అఖిల్ పెళ్లి మార్చి లో జరగడం లేదు అంటూ తెలుస్తుంది . అయితే అఖిల్ అక్కినేని ఇప్పుడు సైలెంట్గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే పనిలో బిజీ అయిపోయాడట .



ఈ సినిమాలో  హీరోయిన్ గా శ్రీలీలని చూస్ చేసుకున్నారట.  నిజానికి "తండేల్" సినిమాలో హీరోయిన్గా నాగచైతన్య సరసన శ్రీలీల నటించాల్సింది కానీ కొన్ని కారణాల చేత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.  ఇప్పుడు అన్నను రిజెక్ట్ చేసిన బ్యూటీ నే సెలెక్ట్ చేసుకున్నాడు అఖిల్ అంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  అంతేకాదు సైలెంట్ గా ఈ సినిమాను సెట్స్ పై కి తీసుకొచ్చేస్తున్నాడట.  పెళ్లికి ముందే ఈ సినిమాని సెట్స్ పై  తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నాడు అఖిల్ అంటూ ఫిలిం  వర్గాలలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: