
అంజలి పేరు చెప్పగానే ఆమెకు సంబంధించిన బ్రేక్ అప్ లవ్ స్టోరీ కూడా అందరికీ గుర్తుకు వస్తుంది .. గతంలో అంజలిని ప్రేమ పేరుతో ఓ హీరో మోసం చేశాడు అన్న వార్తలు వచ్చాయి .. ఆ హీరో మరెవరో కాదు .. తమిళ హీరో జై .. ఈ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవచ్చు కానీ జర్నీ సినిమాలో అంజలితో కలిసి నటించిన హీరో అంటే అందరికీ గుర్తుకు వస్తుంది .. కోలీవుడ్ హీరో జై , అంజలి కాంబినేషన్లో వచ్చిన సినిమానే జర్నీ .. ఈ సినిమా షూటింగ్స్ సమయంలో ఏర్పడ్డ పరిచయం కాస్త తర్వాత ఇద్దరి మధ్య ప్రేమగా మారింది .. తర్వాతా ఇద్దరూ కలిసి కొన్ని ఏళ్ల పాటు డేటింగ్ కూడా చేశారు .. అయితే చివరికి అంజలికి బ్రేకప్ చెప్పి జై తన దారి తాను చూసుకున్నాడని కోలీవుడ్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది .
ఇక అంజలితో రిలేషన్ లో ఉన్న సమయంలో ఆమెతో చేసే సినిమాల డైరెక్టర్లకు నిర్మాతలకు కూడా కొన్ని కండిషన్లు పెడుతూ ఉండేవారట .. అలాగే ఆమెను ఏదైనా సినిమా కోసం కలవాలంటే ముందుగా జై పర్మిషన్ తీసుకునే వారట .. అవుట్డోర్ షూటింగ్లోకి వెళ్లినా కూడా అంజలి తో పాటు జై కూడా వచ్చే వారట అలా వచ్చిన సమయంలో ఆయన ఖర్చులు కూడా నిర్మాతలే భరించే వారిట .. ఇలా చివరకు జై మితిమీరిన జోక్యం ప్రవర్తన చూసుకొని అంజలి నటించాల్సిన కొన్ని హిట్ సినిమాలు కూడా ఆమెకు రాకుండా చేశాడట .. కథలు కూడా ముందుగా జై విని ఓకే చేయాల్సి వచ్చేదట .. ఇలా చివరకు అంజలి సంపాదించుకున్న డబ్బులు కూడా చాలా వరకు జైకు ఇచ్చేద .. ఇలా ఆయన పెట్టే కండిషన్లతో విస్తుకుపోయిన అంజలి ఎన్నో ఇబ్బందులకు గురైయి .. ఇలా చివరకు అంజలిని అన్ని విదల వాడుకుని ఆమెకు బ్రేకప్ చెప్పాడని అంటూ ఉంటారు .