
అయితే ఇదే జోష్లో తన వందో సినిమాను మొదలు పెట్టాలని ఈ సీనియర్ హీరో భావిస్తున్నాడు .. తెలుగులో ఉన్న ఓ ప్రముఖ నిర్మాత నాగార్జున కోసం భారీ కథలు వింటున్నారు .. అందులో కే ఏ కార్తీక్ అనే ఓ తమిళ దర్శకుడు రీసెంట్గా ఒక కథ చెప్పినట్లు తెలుస్తుంది .. అయితే ఆ కథ నాగార్జునకి బాగా నచ్చిందని .. అన్ని అనుకున్నట్టు కుదిరితే నాగార్జున నటించే వందో సినిమా ఇదే అవుతుందని కూడా అంటున్నారు ... ఇక కార్తీక్ కోలీవుడ్లో నితమ్ వరు వానమ్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు .. క్లాస్ టచ్ తో సాగే సినిమా ఇది .. అయితే నాగార్జున కోసం మాత్రం పూర్తిస్థాయి కమర్షియల్ కథని తయారు చేశారని తెలుస్తుంది ..
అయితే తన వందో సినిమా కాబట్టి .. స్టార్ డైరెక్టర్ తో చేస్తే బాగుంటుందని అక్కినేని అభిమానులు ఆలోచన .. కానీ నాగార్జున ఎప్పుడు కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు .. ఆయనకు కథ నచ్చితే సీనియర్ , జూనియర్ ? అనేది అసలు పట్టించుకోరు .. ఇప్పుడు ఈసారి కూడా ఇదే లెక్కలో సినిమాను మొదలుపెట్టబోతున్నారని తెలుస్తుంది .. కుబేర , కూలి సినిమాలు రిలీజ్ అయ్యా ఈ సినిమా షూటింగ్ కు వెళ్లే ఛాన్స్ ఉంది . మరి ఈ సినిమా తో అయినా నాగార్జున తన తోటి హీరోల్లాగా ఫామ్ లోకి వస్తారో లేదో చూడాలి .