నాచురల్ స్టార్ నాని నిర్మాత గా తెరకెక్కించిన సినిమా కోర్ట్ -స్టేట్ వర్సెస్ ఏ నోబడి .. బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ అందుకుంది .. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్ , శ్రీదేవి ఇతర పాత్రలో నటించారు .  ఇక ఈ సినిమాలో సీనియర్ నటులు శివాజీ , సాయికుమార్ , రోహిణి , హర్షవర్ధన్ వంటి వారు కీలక పాత్రలో నటించి మెప్పించారు .. మార్చు 14 న హోలీ కనుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. రామ్ జగదీష్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజే హిట్‌ టాక్ వచ్చేసింది ..


ఇక దీంతో ఈ సినిమా కి భారీ కలెక్షన్లు వస్తూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి . ఇక కోర్టు సినిమా ప్రీమియర్ షోల తో మొత్తం కలుపుని మొదటి రోజు 8.10   కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది .. ప్రియదర్శి హీరో గా తెర‌కెక్కిన ఈ సినిమా ఆయన కెరియర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది .. దాదాపు 11 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నాని నిర్మించార‌ని ఇండస్ట్రీ వర్గాల టాక్ .. ఇక దీంతో మొదటి రోజు బ్రేక్ ఈవెన్‌ కు దగ్గరగా కోర్టు సినిమా కలెక్షన్లు రావడం నాని అభిమానులు ఆనందపడుతున్నారు ..


ఈ వీకెండ్ పూర్తయ్య లోపే భారీగా కలెక్షన్లు పెరిగి అవకాశం కూడా ఉంది .. ఇలా సులువుగా తొలి వారం లోనే 20 కోట్ల మార్క్‌ను ఈ సినిమా అందుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . ఇక ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా మరో 8 కోట్లు ,ఆడియో ద్వారా 50 లక్షలు , శాటిలైట్ ద్వారా రెండు కోట్లు ఈ సినిమాకు వచ్చాయని తెలుస్తుంది .. ఇలా కోర్టు మూవీ రిలీజ్ కి ముందే భారీ లాభాలు తెచ్చిపెట్టింది .. మరి ఇప్పుడు రిలీజ్ తర్వాత కలెక్షన్ లో కూడా అదిరిపోయే రికార్డులు అందుకుంటుంది .. ఇక దీంతో హీరో నాని పై చిత్ర పరిశ్రమ నుంచి గొప్ప ప్రశంసలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: