ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా భాద్యతలు వహిస్తున్న పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు తాను కమిట్ అయిన భారీ సినిమాలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు..ఎంతో కాలం హోల్డ్ లో వున్న “హరిహర వీరమల్లు” సినిమాకు ఎట్టకేలకు మోక్షం కలగబోతుంది..మార్చి 28 నే ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ ప్రకటించినా షూటింగ్ డిలే అవ్వడంతో మే 9 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ తాజాగా అద్భుతమైన పోస్టర్ రిలీజ్ చేసారు..అయితే పవన్ కల్యాణ్ ప్రస్తుతం తనకి రాజకీయాలు, సామజిక సేవ, ప్రజా సంక్షేమమే ప్రాధాన్యతలని చెప్పారు. నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఆయన అదే సందేశం ఇచ్చారు..సభకు హాజరైన అభిమానులు ఓజి ఓజి అని అరుస్తూ ఉంటే కార్యకర్తల గౌరవం కోసం ఎలాంటి నినాదాలు చేయొద్దని వారించారు..

దీనితో పవన్ సినిమాలకు దూరం కానున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం పవన్ కు తీరిక లేకపోవడంతో పాటు ఆరోగ్యం తరచుగా బాగోట్లేదని చెప్పుకొచ్చారు..అలాగే తన రెండో కొడుకుని సైతం ఎత్తుకోలేనంత బలహీనంగా అయ్యానని, మీ అండదండలతో ముందుకు వెళ్తానని చెప్పడం అభిమానులను కాస్త ఆలోచించేలా చేసింది..దీనితో పవన్ కల్యాణ్ చివరిగా “ఓజీ” సినిమాతో సినిమాలకు దూరం కానున్నాడని ప్రచారం జరుగుతుంది..అయితే హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఓజీ తో పాటే పూర్తి చేస్తారని టాక్ వినిపిస్తుంది..

 డిప్యూటీ సీఎంగా వున్న పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో కీలక శాఖలు ఉండటంతో ఇకపై మేకప్ వేసుకుని ఎక్కువ రోజులు సెట్స్ పై ఉండటం సాధ్యం కాదు.దీనితో అకీరా నందన్ ని ఇంకో రెండేళ్లలో సినిమాల్లోకి లాంచ్ చేసే ప్లాన్ ఉన్నట్లు సమాచారం..పవన్ ఫ్యాన్స్ ఓజీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఆ సినిమాలో పవన్ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు.. దీనితో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: