టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు కాగా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఇటీవల దేవిశ్రీ ప్రసాద్ తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. నా పాటలు చాలామంది కాపీ కొట్టారంటూ దేవిశ్రీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేను వర్క్ చేసిన డైరెక్టర్లు అంతా నా అభిప్రాయాలను గౌరవిస్తారని ఆయన తెలిపారు.
 
ఉప్పెన మూవీ కథ విన్న తర్వాత నీ కన్ను నీలి సముద్రం పాటను కంపోజ్ చేశానని దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. సుకుమార్ ఆ ట్యూన్ విని అసూయగా ఉందని అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. బుచ్చిబాబు నా శిష్యుడు కాబట్టి ఆ ట్యూన్ తనకు ఇచ్చేస్తున్నానని లేదంటే నా సినిమాలో పెట్టేసేవాడినని సుకుమార్ అన్నారని దేవిశ్రీ ప్రసాద్ కామెంట్లు చేయడం గమనార్హం.
 
నాకు దక్కిన అతిపెద్ద ప్రశంస ఇదేనని అనుకున్నానని ఆయన వెల్లడించారు. డైరెక్టర్ కథ చెప్పిన సమయంలో ఆడియన్స్ లా వింటానని దేవిశ్రీ పేర్కొన్నారు. ఆ సినిమాలో జలజలా జలపాతం సాంగ్ విని నా సినిమానాకంటే మీకే బాగా అర్థమైందని అన్నారని ఆయన కామెంట్లు చేశారు. ఇలాంటి కామెంట్లను నేను ప్రశంసలలా తీసుకుంటానని దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు.
 
సుకుమార్ కు లిరిక్స్ పై మంచి పట్టు ఉందని పుష్ప ది రూల్ లో జాతర సాంగ్ ను 10 నిమిషాలలో పూర్తి చేశామని సూసేకీ సాంగ్ విని సుకుమార్, చంద్రబోస్ ఇద్దరూ డ్యాన్స్ చేశారని దేవిశ్రీ అన్నారు. ఒక పాటను స్పూర్తి పొందడం అంటే అలాంటే పాటనే మరొకటి చేయడం అని ఆయన వెల్లడించారు. నేను కాపీ కొట్టనని రీమేక్స్ చేయనని ఇప్పటివరకు నేను ఏ సినిమాకు రీమేక్స్ చేయలేదని ఆయన తెలిపారు. నా పాటలను చాలామంది కాపీ కొట్టారని ఆయన పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: