రష్మిక మందన్నా.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ హీరోయిన్ పేరే ఓ రేంజ్ లో  మారుమ్రోగిపోతుంది . బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్లు  అందుకోవడమే కాకుండా.. ఒక్కొక్క సినిమాకి 10 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటూ వచ్చింది. రీసెంట్ గానే ఆమె నటించిన "ఛావా" సినిమా హిట్ అవ్వడంతో ఒక్కొక్క సినిమాకి 12 కోట్లు ఛార్జ్ చేస్తుంది . అంతేకాదు సౌత్ ఇండియాలో నయనతార తర్వాత అలాంటి హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ రష్మిక మందన్నానే కావడం గమనార్హం.


ఇలాంటి మూమెంట్లోనే రష్మిక మందన్నాకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.  తెలుగులో బన్నీతో పుష్ప సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . అదేవిధంగా ఇప్పుడు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ తో "సికిందర్" అనే సినిమాలో నటించి తన కోరిక తీర్చేసుకుంది . ఇక మిగిలింది కోలీవుడ్ హీరో సూర్య. ఆమె కోలీవుడ్ ఇండస్ట్రీలో సూర్య కి బిగ్ ఫ్యాన్ . ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే తెలుగులో బన్నీతో సినిమా నటించాలి అంటూ ఆశపడింది . ఆ కోరిక నెరవేరింది .


బాలీవుడ్లో సల్మాన్ నటించాలి అంటూ ఆశపడింది . ఆ కోరిక కూడా నెరవేరిపోయింది.  ఇప్పుడు మిగిలింది సూర్య.  కోలీవుడ్ హీరో సూర్యతో ఆమె నటించాలి అంటూ ఆశ పడుతుందట.  దానికోసం వెయిట్ చేస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం సూర్య కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నాను అనుకుంటున్నారట మేకర్స్ . అది కుదిరితే మాత్రం రష్మిక మందన్నా  కల నెరవేరినట్టే . ఇక రష్మిక మందన్నాని  ఢీకొట్టే హీరోయిన్ ఇండస్ట్రీలో ఇప్పుడు అప్పట్లో వచ్చే ఛాన్స్ లేదు. చూడాలి మర్ నెక్స్ట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి: