
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కు కాస్త విరామం ఇచ్చాక .. రీఎంట్రీ ఇస్తూ చేసిన బాలీవుడ్ హిట్ రీమేక్ వకీల్ సాబ్ . హిందీలో అమితాబచ్చన్ , తాప్సి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా తమిళం లోనూ అజిత్ కథానాయకుడి గా రీమేక్ అయింది .. అక్కడ బోని కపూర్ నిర్మించారు .. శ్రద్ధ శ్రీనాథ్ తమిళంలో హీరోయిన్గా నటించింది .. ఇలా రెండు భాషలలో చూసేసిన సినిమాను పవన్ తో రీమిక్స్ చేయాలని అనుకోవడం దిల్ రాజు కి పెద్ద పని కాదు .. కాన్నీ ఎన్నో ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇవ్వడం తో ఆయన రీయంట్రీ ఇస్తూ డేట్లు ఇవ్వడం తో కొత్త కథను పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగినట్టుగా తయారు చేయడానికి టైం పడుతుందని భావించిన దిల్ రాజు పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు ..
పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగినట్టుగా అన్ని హంగు ఆర్భాటాలు ఉన్నాయి .. బద్రి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ , ప్రకాష్ రాజ్ కలిసిన నటించిన సీన్లు కూడా బాగా ఆదరణ పొందాయి .. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు .. ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించిన నివేద థామస్ , అంజలి , అనన్య నగల మాత్రం మళ్లీ మంచి సినిమా లేక ఎదురుచూస్తున్నారు .. ముఖ్యంగా నివేద థామస్ ఈ సినిమాతో ఊపు అందుకుంటుంది అనుకుంటే సాకిని దాకిని తప్ప మరో సినిమాలో ఆమె కనిపించలేదు ..
ఇక అంజలి కి పెద్ద హీరోల సరసన హీరోయిన్గా అంటే ఔట్ డేటెడ్ అని ఫీల్ అవుతున్నారు .. గేమ్ చేంజర్ సినిమాలో మాత్రమే మంచి అవకాశం వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ అయింది .. ఇక అనన్య నాగళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు .. ఆమెకు హీరోయిన్గా అవకాశాలు ఇచ్చే దర్శక నిర్మాతలు కనపడటం లేదు .. సోషల్ మీడియాలో మాత్రం అనన్య అందాల ఆరబాతుతో మోత మోగిస్తుంది. ఏది ఏమైన పవన్ కళ్యాణ్ పక్కన ఒక సినిమాలో నటిస్తే చాలు అని ఎంతో మంది హీరోయిన్లు భావిస్తారు .. కానీ ఈ ముగ్గురు హీరోయిన్లు పవన్ సినిమాలు నటించిన వీరికి ఏమాత్రం పేరు రాలేదు ..