టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది తనదైన నటన, అందం, అమాయకత్వంతో సినిమాలలో అవకాశాలను అందుకుంది. తన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న లావణ్య అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ఎన్నో సినిమాలలో నటించిన ఈ చిన్నది ఎన్నో అవార్డులను సైతం అందుకుంది. సినిమాల పరంగా తన కెరీర్ సాఫీగా కొనసాగుతున్న సమయంలో మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టింది.


హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి సినిమాలలో నటిస్తున్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఆతి తక్కువ సమయంలోనే ప్రేమగా మారి కొన్నేళ్లపాటు సీక్రెట్ గా వారి రిలేషన్ కొనసాగించారు. అనంతరం కుటుంబ సభ్యుల సమక్షంలో విదేశాలలో ఈ జంట వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. రీసెంట్ గానే లావణ్య, వరుణ్ తేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. అయితే వివాహం తర్వాత లావణ్య త్రిపాఠి సినిమాలు చేయడం పూర్తిగా మానేసింది. కొన్ని రకాల సిరీస్ లలో నటిస్తోంది.


ఇక వరుణ్ తేజ్ మాత్రం సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నారు. ఇక లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తనకు తన కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోని ఈ చిన్నది తన అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్లు చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


ఆ ఫోటోలలో లావణ్య త్రిపాఠి తన అందాలను చూపకనే చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అవి చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి దుస్తులు ధరించడమా అని నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఇన్ని రోజులు ఎలా సాంప్రదాయంగా ఉన్నావో అలాగే ఉండొచ్చు కదా మెగా కుటుంబానికి కోడలివి అయి ఉండి ఇలాంటి దుస్తులు ధరించడం అవసరమా అని కొంతమంది అభిమానులు అంటున్నారు. మరి ఈ వార్తలపై లావణ్య త్రిపాఠి ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: