టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది హీరోలు మాత్రమే వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ ఇండస్ట్రీలోకి హీరోలుగా పరిచయం అవుతారు. అలాంటి వారిలో నటుడు ప్రభాస్ ఒకరు. కృష్ణంరాజు వారసుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్ అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన నటన, మేనరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ హీరో ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో అభిమానుల ముందుకు వస్తూనే ఉంటాడు. కాగా, ప్రభాస్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకోవడం విశేషం. 


అయితే ఈ హీరో బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ సినిమా అనంతరం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం. సినిమాల పరంగా ఎంతో సక్సెస్ అందుకుంటున్న ప్రభాస్ ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నాడు. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ ఫోటోని ప్రభాస్ తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకున్నాడు.


అందులో ప్రభాస్ ఓ అమ్మాయిని ముద్దు పెడుతూ ఫోటోలు తీసుకున్నారు. ప్రభాస్ అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. తాను ఎక్కువగా సిగ్గుపడుతూ, అమ్మాయిలకు దూరంగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయిని ముద్దు పెడుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


ఆ ఫోటో కింద డార్లింగ్ కిస్ లవ్ యు డార్లింగ్ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా హాగ్, కిస్, లవ్ ఎమోజీలను పెట్టడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ప్రభాస్ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడా అనే సందేహంలో చాలామంది అభిమానులు పడ్డారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ విషయం పైన ప్రభాస్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకి రాదు. కాగా, ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, ది రాజాసాబ్ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: