
ప్రస్తుతం ఈ చిన్నదాని వయసు 40 ఏళ్ల పైనే ఉన్నప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. దానికి గల కారణం ఈ చిన్నది గతంలో ఓ వ్యక్తిని ప్రేమించిందట. వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకుందట. ఇక ఏమైందో తెలియదు ఇప్పటివరకు వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం ఈ చిన్నదానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
త్రిష సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఓ నిర్మాత చాలా ఇబ్బంది పెట్టాడట. తాను చెప్పిన విధంగా చేస్తే సినిమా అవకాశాలు ఇప్పిస్తానని అన్నారట. కానీ దానికి త్రిష ఒప్పుకోకపోవడంతో కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొందట. అయినప్పటికీ ఏమాత్రం వెనుదిరగకుండా ముందుకు నడిచి అగ్ర హీరోయిన్ గా చక్రం తిప్పింది. అప్పటికి ఇప్పటికీ ఈ చిన్నది వరసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది.
వయసు పెరిగినప్పటికీ అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తోంది. కాగా ఈ చిన్నది సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ వారిని ఆకట్టుకుంటుంది. వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తుండడం విశేషం.