టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ అందులో కొంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్లుగా రాణిస్తారు. ఇక మరికొంతమంది ఎంతో అందం, నటన ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేక పోతారు. అలాంటి వారిలో ప్రముఖ నటి ఎస్తర్ నోరోన్హ ఒకరు. ఈ బ్యూటీ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. 2013లో పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన 1000 అబద్దాలు అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో ఈ చిన్నదాని నటన బాగున్నప్పటికీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 


అనంతరం భీమవరం బుల్లోడు సినిమాలో నటించింది. అయినప్పటికీ పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే అవకాశాలను అందుకుంది. ఆ సినిమా తర్వాత జయ జానకి నాయక, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ లాంటి సినిమాలు చేసింది. చివరిగా ఈ చిన్నది కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్ సినిమాలోను నటించింది. ఇక ఈ బ్యూటీ వ్యక్తిగత విషయాలు వచ్చినట్లయితే.... టాలీవుడ్ ప్రముఖ సింగర్ యాక్టర్ నోయల్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. 2019లో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.


కానీ కేవలం 6 నెలల సమయంలోనే వారి వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎస్తర్ తరచూ వార్తలో నిలుస్తున్నారు. ఈ బ్యూటీ ఓ వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందట. అది కూడా 60 ఏళ్ల ముసలాడితో అని సమాచారం అందుతోంది. 60 ఏళ్ల ముసలాడితో ఎస్తర్ చాలా కాలం నుంచి సీక్రెట్ గా ఎఫైర్ కొనసాగిస్తుందట.


అంతేకాకుండా ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకుంటుందట. ఈ విషయం తెలిసి తన కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరు ఆశ్చర్యంలో పడ్డారట. 60 ఏళ్ల ముసలాడిని వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ కుటుంబ సభ్యులు ఆరా తీస్తున్నారట. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: