టాలీవుడ్ లో మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ ఈమె గతంలో రెండు మూడు చిత్రాలలో నటించిన సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ బాలకృష్ణతో నటించిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరొకసారి దగ్గర అయ్యింది ఈ ముద్దుగుమ్మ. మలయాళం ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించి బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. నిరంతరం సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే ఫోటోలే హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి. తెలుగులో మళ్లీ ఏ సినిమాలో కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ పలు రకాల షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకుంటోంది.


మలయాళం లో మాత్రం పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నది. ఇదంతా ఇలా ఉండగా హనీ రోజు పైన ఒక నటి తీవ్రమైన ఆరోపణల సైతం చేస్తూ ఉన్నది. అసలు విషయంలోకి వెళ్తే హనీ రోజ్ తప్పుడు దారిలో డబ్బులు సంపాదిస్తోందంటూ ఆమె ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఇక అలా ఆరోపణలు చేస్తున్న నటి ఎవరో కాదు ఫరా శిబిలా.. హని రోజ్ గురించి ఇలా మాట్లాడుతూ.. మనపై మనకు నమ్మకం ఉన్నప్పుడే మనం ముందడుగు వేయాలి.. ఎవరైనా సరే ప్రతిభను నమ్ముకునే ముందుకు వేయాలి శరీరాన్ని కాదు అంటూ వ్యాఖ్యలు చేసింది.


హనీ రోజు ఇప్పుడు శరీరాన్ని చూపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నదని ఆమె డ్రెస్సింగ్ గురించి తాను మాట్లాడడం లేదు.. కానీ ఆమె ఫోటోషూట్లలో పలు రకాల ఫోజులు ఇస్తూ ఉంటుంది పలు రకాల యాంగిల్స్ లలో ఫోటోలను వీడియోలను ఆమె స్వయంగా షేర్ చేస్తూ ఉంటుంది అంటూ వెల్లడించింది.అందరూ కూడా తమ శరీరాలను చూపిస్తూ ఎగ్జిబిషన్లో పెట్టేస్తున్నారని హని రోజ్ కూడా అలాగే చేస్తోందంటూ నటి ఫరా శిబిలా వ్యాఖ్యలు చేసింది. హనీ రోజు అమాయకురాలు ఏమి కాదు.. ఆమెకు అన్ని తెలుసని డబ్బులు ఎలా సంపాదించాలనేదే ఆమె చేస్తున్నది తప్పు అభిప్రాయం అని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: