
ఇక ఈ సినిమా షూటింగ్ తో హైప్ పెంచడమే కాకుండా.. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లతోనే మంచి క్రేజను తీసుకుచ్చేలా చేశారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా రైట్స్ కూడా భారీగా డిమాండ్ పెరిగిపోయింది. తాజాగా కూలి సినిమా ఓటీటి రైట్స్ క్లోజ్ అయినట్లుగా టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ఓటీటి రైట్స్ ని ప్రముఖ ఓటీటి నిర్మాణ సంస్థలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ 120 కోట్ల రూపాయలకు సైతం కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉండడంతో ఈ సినిమాకి కాస్త ప్లేస్ గా మారింది. అటు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఓటిటి హక్కుల విషయంలో ఇలాంటి స్థాయిలో క్రేజీ సంపాదించడంతో ఇక సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ట్రైలర్ విడుదలైతే ఎలా ఉంటుందో అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సంగీతాన్ని అనురుద్ అందిస్తూ ఉన్నారు. అలాగే జైలర్ 2 చిత్రం లో కూడా రజనీకాంత్ నటిస్తూ ఉన్నారు. ఇలా రెండు చిత్రాలను ఒకేసారి షూటింగ్లను బ్యాలెన్స్ చేస్తూ ఉండడం గమనార్హం.