టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఎట్టకేలకు సినిమా రాబోతుంది. ఎస్ఎస్ఎంబి 29 మూవీ పూజా కార్యక్రమం కూడా మొదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె.ఎల్‌.నారాయణ నిర్మిస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు, జక్కన్న కాంబోలో వస్తున్న ఈ సినిమాలో నుంచి ఇంతవరకు ఎలాంటి సీన్ కూడా లీక్ కాలేదు. కనీసం సినిమా సెట్ ఇమేజ్ కూడా బయటికి రాలేదు. ఇక ఈ సినిమా నుండి ఒక్క పిక్ కూడా లీక్ అవ్వకపోవడంతో ప్రిన్స్ మహేష్ బాబుతో, జక్కన్న ముందే నో మోర్ లీక్స్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.  

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఆ 20 నిమిషాలు వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. ఆ సీన్ కి థియేటర్స్ మొత్తం షేక్ అయిపోవాల్సిందే అంటూ టాక్ వినిపిస్తుంది. ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం ఏళ్లుగా ఫాలో అవుతున్న సెంటిమెంట్ ని కూడా మహేష్ బాబు బ్రేక్ చేశాడని అందరికీ తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న SSMB29పై భారీ అంచనాలు ఉన్నాయి.


ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా సినిమా షూటింగ్ లో భాగం అయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. హోలీ పండుగ అయిన వర్కింగ్ చేయాల్సిందే అని.. ఇండియాలోనే ఉన్నాను అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ కి మహేష్ బాబు భార్య నమ్రత స్పందించింది. ప్రియాంక ఫోటోలకు హ్యాపీ హోలీ అంటూ కామెంట్ పెట్టింది. దీంతో ప్రియాంక SSMB29 సినిమా షూటింగ్ లోనే ఉందని అర్దం అవుతుంది. ప్రియాంక, మహేష్ బాబు, జకన్నతో ఒడిశాలో సెట్ లో ఉందని తెలుస్తోంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: