సౌత్ ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది స్టార్ హీరోలలో అక్కినేని ఫ్యామిలీలో ఉన్న నాగేశ్వరరావు,నాగార్జున లు కూడా ఒకరు.. వీరిలో నాగేశ్వరరావు టాలీవుడ్ ఇండస్ట్రీకి గుర్తింపు తేవడంలో ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ల వల్లే టాలీవుడ్ కి ఇంత గుర్తింపు ఉంది అని మాట్లాడుకుంటారు. ఇక ఏఎన్ఆర్ తర్వాత ఆయన వారసుడు నాగార్జున కూడా తన ఇంటి పేరుని కాపాడి ఇండస్ట్రీలో స్టార్ గా రాణించారు. అలా నాగార్జున ఇండస్ట్రీకి రాకముందు అమెరికాలో మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అక్కడే కొద్ది రోజులు జాబ్ కూడా చేశారు.కానీ ఆ తర్వాత ఈయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఇండియాకి తిరిగి వచ్చాక ఏఎన్ఆర్ నాగార్జునకి ఇండస్ట్రీలో ఉన్న బిగ్గెస్ట్ నిర్మాత అయినటువంటి దగ్గుబాటి రామారావు కూతురు లక్ష్మీని ఇచ్చి వివాహం చేశారు. 

అలా లక్ష్మీ,నాగార్జునల వివాహ బంధం కొద్ది సంవత్సరాలు కొనసాగినప్పటికీ ఎప్పుడైతే నాగార్జున సినిమాల్లోకి వచ్చారో ఆ తర్వాత వీరి మధ్య బంధం బీటలు వారింది. నాగచైతన్య పుట్టాక నాగార్జున లక్ష్మీలు మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ అమలని రెండో పెళ్లి చేసుకొని అఖిల్ కి జన్మనిచ్చారు.ఇక నాగచైతన్య తల్లి లక్ష్మీతో నాగార్జున విడిపోయినప్పటికీ నాగచైతన్య బాధ్యతలు అన్నీ కూడా నాగార్జుననే తన భుజాన వేసుకున్నారు. అమల కూడా నాగచైతన్యను సొంత కొడుకు లాగే భావించింది.అలా చిన్నతనంలో తల్లి దగ్గర పెరుగుతూనే హాలిడేస్ వచ్చిన సమయంలో తండ్రి దగ్గరికి చైతు వచ్చేవారట.ఇక నాగచైతన్య చదువు విషయానికి వస్తే.. ఆయన సెయింట్ మేరీ కాలేజ్ హైదరాబాదులో తన విద్యను పూర్తి చేసి తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కాలిఫోర్నియా,ముంబై వంటి ప్రాంతాలలో నటనలో శిక్షణ తీసుకొని జోష్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక అక్కినేని అఖిల్ విషయానికి వస్తే.. చిన్నప్పటినుండే తండ్రి బాటలో సినిమాల్లోకి రావాలనుకున్న అఖిల్ తండ్రి అనుకున్న బిజినెస్ మేనేజ్మెంట్లో చేరకుండా లీ స్ట్రాస్ బెర్గ్ థియేటర్స్ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటనా రంగంలో శిక్షణ తీసుకొని సినిమాల్లోకి వచ్చారు. ఇక నాగార్జున ఇద్దరు కొడుకుల పెళ్లిల విషయానికి వస్తే.. నాగచైతన్య మొదట హీరోయిన్ సమంతని పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకొని గత ఏడాదే మళ్లీ శోభిత దూళిపాళ్లని పెళ్లి చేసుకున్నారు. ఇక అఖిల్ పెళ్లి విషయానికి వస్తే..మొదట శ్రియా భూపాల్ తో నిశ్చితార్థం చేసుకొని విభేదాలు రావడంతో ఆ పెళ్లి రద్దు చేసుకొని గత ఏడాది జైనబ్ రావడ్జి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి ఈ నెలలో ఉండబోతున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. అలా అక్కినేని నాగార్జున ఇద్దరు కొడుకులు కూడా పెద్ద చదువులు చదివి సినిమాల్లో రాణిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: