
అలాగే కస్టడీలో తన పైన లైంగిక దాడికి పాల్పడుతున్నారని నిద్ర పోనివ్వకుండా చేస్తున్నారని భోజనం తినకుండా చేస్తున్నారంటూ ఆమె ఆరోపణలు చేయడం జరిగింది. తనతో బలవంతంగా వైట్ పేపర్ల పైన సంతకాలు కూడా సేకరిస్తున్నారని తెలియజేసిన ఈమె బెంగళూరులోని ఒక ప్రత్యేకమైన కోర్టుని ఆశ్రయించి బెయిల్ పిటిషన్ కి అప్లై చేయగా కోర్టు కొట్టి వేయడం తర్వాత ఈమె ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ గోల్డ్ స్మగ్లింగ్ వెనుక చాలామంది రాజకీయ నాయకులు పోలీస్ అధికారులు ఉన్నారనే విధంగా ఆరోపణలు రావడంతో ఈ కేసును చాలా తీవ్ర స్థాయిలో విచారించబోతున్నారట అధికారులు.
కర్ణాటక అసెంబ్లీలో కూడా ఈ కేసు విషయం పైన ఒక చర్చనీయాంశం కి రావడంతో ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ కేసు విషయంతో చాలా రచ్చ రచ్చ జరుగుతోందట. ఇక బంగారం అక్రమ రవాణా చేసిన రన్యా రావు తండ్రి కర్ణాటక డిజిపి పోలీస్ అధికారి కావడం చేత ఈ ఆరోపణలను చేసినట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి 14 కిలోలకు పైగా బంగారాన్ని ఈ అక్రమంగా తరలించినట్లుగా వినిపించాయి. మార్చి 3 న ఈమెను అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేయడం జరిగింది. మరి ఈ కేస్ ఇంకా ఎంతవరకు వెళుతుంది మరి ఏంటన్నది చూడాలి మరి.