టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కలువ కళ్ళ భామ “కాజల్ అగర్వాల్” గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందం అభినయంతో ఈ భామ స్టార్ హీరోయిన్ గా రానించింది.. భాషతో సంబంధం లేకుండా ఈ భామ అన్నీ ఇండస్ట్రీస్ లో హీరోయిన్ గా ఆకట్టుకుంది.. టాలీవుడ్ లో ఈ భామ లక్ష్మీ కల్యాణం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోక పోయినా ఈ అమ్మడి నటన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. రాంచరణ్,రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మగధీర ఈ అమ్మడి కెరీర్ ని మార్చేసింది.. ఈ సినిమా లో యువరాణి మిత్రవిందగా కాజల్ అద్భుతంగా నటించింది.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో కాజల్ కి వరుసగా ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, అల్లుఅర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్స్ వచ్చాయి.

.స్టార్ హీరోలందరి సినిమాలలో హీరోయిన్ గా నటించి కాజల్ వరుస సూపర్ హిట్స్ అందుకుంది.. కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం ఈ భామ అద్భుతంగా రానించింది.. ఇదిలా ఉంటే హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో వున్న సమయంలో కాజల్ తన చిన్న నాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని కాజల్ పెళ్లి చేసుకుంది..అక్టోబర్ 20,2020 న వీరి వివాహం ఎంతో గ్రాండ్ గా జరిగింది.. పెళ్లి అయిన తరువాత కొన్నాళ్ళ పాటు సినిమాలకు దూరంగా వున్న కాజల్.. బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాతో మళ్ళీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది..

ఆ తరువాత కాజల్ లీడ్ రోల్ లో చేసిన “సత్యభామ” సినిమా అంతగా ఆకట్టుకోలేదు..పెళ్లి అయిన రెండేళ్లకు కాజల్, గౌతమ్ దంపతులకి కొడుకు కూడా పుట్టాడు.. తన బాబుకి కాజల్ ‘నీల్’ అని పేరు పెట్టింది.. ప్రస్తుతం నీల్ భాద్యతను చూసుకుంటూ కాజల్ హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంటుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: