- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచ‌యం అక్క‌ర్లేదు. శివాజీ గ‌త 30 యేళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్నాడు. తెలుగులో అనేక సినిమాల్లో హీరోగా నటించిన ఆయన తర్వాత కాలంలో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. చాలా గ్యాప్ వ‌చ్చింది. బూచ‌మ్మ బూచోడు త‌ర్వాత మ‌ళ్లీ శివాజీ హీరో గా తెర‌మీద క‌న‌ప‌డ‌లేదు. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఆయన ఎంట్రీ .. ఆ తర్వాత ఆయన వ్యక్తిత్వం చూసి అనేకమంది ఈ జనరేషన్ కిడ్స్ కూడా ఆయనకు అభిమానులు అయ్యారు. ఆ త‌ర్వాత 90 స్ అనే వెబ్ సిరీస్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి న‌టుడి గా త‌న‌లోని వైవిధ్యత ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని ఫ్రూవ్ చేసుకున్నారు. అలాంటి శివాజీ తాజాగా నాని నిర్మాతగా రామ్ జగదీష్ అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో రూపొందించిన కోర్ట్ అనే సినిమాలో నటించాడు.


ఈ సినిమాలో మంగపతి అనే పాత్రలో నటించాడు అనడం కంటే జీవించాడు అనే చెప్పాలి. శివాజీ స్క్రీన్ మీద క‌న‌ప‌డిన ప్ర‌తి సారి మ‌నోడి న‌ట‌న తో పాటు శివాజీ డైలాగ్ డెలివ‌రీ కి ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. శివాజీ లో స‌రికొత్త విల‌నిజం చూస్తున్న‌ప్పుడు మ‌నం సౌతం ఔరా అని ఆశ్చ‌ర్య పోవాల్సిందే. ఒక్కోసారి మ‌న‌కు తెలియ‌కుండానే క్లాప్స్ కొడ‌తాం .. మ‌రోసారి మ‌న‌కు తెలియ‌కుండానే విజిల్స్ వేస్తాం .. అంత‌లా శివాజీ పాత్ర లీనం చేసింది. మనం రియాలిటీలో చూసిన కొన్ని పాత్రలకు ఆపాదించుకునేలా ఆ పాత్ర ఉండటంతో చాలామంది శివాజీ పాత్రకు కనెక్ట్ అయిపోతున్నార‌నే చెప్పాలి. కోర్ట్ సినిమాలో మంగ‌ప‌తి పాత్ర దెబ్బతో శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ లో మరిన్ని పాత్రలు లభిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: