మెగాస్టార్ చిరంజీవి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ పరంగా ఇతర హీరోలకు అందని స్థాయిలో ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా సీనియర్ హీరోలలో చిరంజీవి నంబర్ వన్ అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఎంతోమంది హీరోల నుంచి గట్టి పోటీ ఎదురైనా చిరంజీవి ప్రతి సందర్భంలో విజయం సాధిస్తూ తన సక్సెస్ తో అందరినీ ఒకింత ఆశ్చర్యపరుస్తూ కెరీర్ పరంగా ముందడుగులు వేశారు.
 
చిరంజీవి సినిమాల్లో సక్సెస్ సాధించడంతో నాగబాబు, పవన్ కళ్యాణ్ సైతన్ సినిమాల్లో సులువుగానే సక్సెస్ సాధించడం సాధ్యమైంది. పవన్ పొలిటికల్ గా ఎదిగి ఎంతోమందికి స్పూర్తిగా నిలవగా నాగబాబు సైతం త్వరలో ఎమ్మెల్సీ కానున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తను గెలవడంతో పాటు ఫ్యామిలీని గెలిపించారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అయితే కూతుళ్లకు సంబంధించిన కొన్ని వివాదాలు, విడాకులకు సంబంధించిన కొన్ని వార్తలు మాత్రం మెగా ఫ్యామిలీని ఒకింత ఇబ్బంది పెట్టాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకోగా ఈ వివాదాలు మాత్రం ఆ కుటుంబానికి మాయని మచ్చలా మిగిలాయని చెప్పవచ్చు. మెగా హీరోలు మరిన్ని విజయాలు సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
 
కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తే మెగా ఫ్యామిలీకి ఎవరూ సాటిరారని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అయితే అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మెగా హీరోల రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా భవిష్యత్తులో మెగా హీరోలు మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. చిరంజీవి సైతం రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. చిరంజీవి రెమ్యునరేషన్ ప్రస్తుతం 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఆరు నెలల గ్యాప్ లో చిరంజీవి నటించిన రెండు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. అనిల్ రావిపూడి తన సినిమాలను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: