
ఇప్పటికీ బాలయ్య కెరీర్ లో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు లేవనే విమర్శ ఉన్నప్పటికీ బాలయ్య సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తూ సీనియర్ హీరోలలో బాలయ్యకు బాలయ్యే సాటి అని ప్రూవ్ చేస్తున్నాయి. బాలయ్య యాడ్స్ లో నటిస్తున్నా, రాజకీయాల్లో కొనసాగుతున్నా ప్రతి పనిలో విజయం దక్కుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
బాలయ్య రెమ్యునరేషన్ ప్రస్తుతం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా కూతుళ్లను పెంచే విషయంలో వాళ్లకు సక్సె ఫుల్ గా తీర్చిదిద్దే విషయంలో బాలయ్యకు ఎవరూ సాటిరారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాలయ్య మరికొన్ని సంవత్సరాల పాటు కెరీర్ పరంగా సంచలన విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
బాలయ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నరు. ఈ ఏడాదే బాలయ్య అఖండ2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అఖండ సీక్వెల్ లో యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. అఖండ2 సినిమా బోయపాటి శ్రీను కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి. బాలయ్య ఇతర భాషలపై కూడా దృష్టి పెడుతుండగా నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.