
అనుష్క అరుంధతి సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సంపాదించుకున్నది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి బ్రాండ్ సంపాదించుకున్నా అనుష్క బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్, అనుష్క కాంబినేషన్లో రావలసిన సినిమా బంగారం.. అయితే ఈ సినిమా చివరి నిమిషంలో హీరోయిన్ ని డైరెక్టర్ ధరణి మార్చేశారట. ఈ సినిమా 2006లో విడుదలై యావరేజ్ గా నిలిచింది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ ఉండదు కేవలం మీరా చోప్రా, రీమాసేన్ ఇద్దరు హీరోయిన్స్ గా ఉన్నారు. ఇక వీరిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ కి ఫెయిర్ కాదు ఈ చిత్రం చివరిలో త్రిష గెస్ట్ అపీరియన్స్ గా పవన్ కళ్యాణ్ కి జోడిగా త్రిష కనిపించింది. ఈ పాత్రకి మొదట అనుష్క అని అనుకున్నప్పటికీ.. 2005లో అనుష్క ఎంట్రీ ఇవ్వడం ఇండస్ట్రీలోకి జరిగింది .కానీ ఆ సమయంలో అనుష్క అంటే ఎవరికీ తెలియక పోవడంతో ఈ సినిమాలో కొంతమేరకు పాపులారిటీ ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నారట డైరెక్టర్ ధరణి. ఆ తర్వాతే హీరోయిన్ త్రిషని సెలెక్ట్ చేసుకుని ఫైనల్ గా ఎంపిక చేశారు. అలా పవన్ ,అనుష్క కాంబినేషన్లో ఈ సినిమా మిస్ అయ్యిందట.